ఏడేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మఠాధిపతి
 

by Suryaa Desk | Fri, Feb 27, 2026, 03:04 PM

కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో ఓ మఠాధిపతి దారుణానికి ఒడిగట్టాడు. ఏడేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితుడిని షహాపుర్ తాలూకాలోని మహల్ రోజా మఠానికి చెందిన మల్లికార్జున ముత్యగా గుర్తించారు.మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన ఓ కుటుంబం తమ బంధువు పుట్టినరోజు వేడుకల కోసం ఈ మఠానికి వచ్చింది. ఈ క్రమంలో పీఠాధిపతి అయిన మల్లికార్జున ముత్య ఆ కుటుంబంలోని ఏడేళ్ల చిన్నారిని ఒడిలో కూర్చోబెట్టుకుని అసభ్యంగా ముద్దులు పెట్టాడు. అయితే, ఈ దారుణాన్ని అడ్డుకోవాల్సిన తల్లిదండ్రులు.. బాబా ఆశీస్సులు ఇస్తున్నాడని భావించి, ఆ దృశ్యాలను తమ ఫోన్‌లో వీడియో తీశారు. సోషల్ మీడియాలో లైకుల కోసం ఆ వీడియోను అప్‌లోడ్ చేయడంతో ఈ అకృత్యం వెలుగులోకి వచ్చింది.ఈ వీడియోపై కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా స్పందించి విచారణకు ఆదేశించింది. పోలీసుల విచారణ అనంతరం గోగి పోలీస్ స్టేషన్‌లో నిందితుడైన మల్లికార్జున ముత్యపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

Latest News
India emphasises need for greater representation of Global South at UN Tue, Apr 21, 2026, 02:41 PM
UN Security Council condemns killing of peacekeeper in Lebanon Tue, Apr 21, 2026, 02:31 PM
India tops global AI health adoption at 85 pc, far ahead of US, UK: Report Tue, Apr 21, 2026, 02:30 PM
India holds fuel prices steady as US, UAE, Australia, Pak see sharp surge Tue, Apr 21, 2026, 02:29 PM
Tushar, Mannat share lead in IGPL Congo Tue, Apr 21, 2026, 02:23 PM