ఎన్నికల నేపథ్యంలో 'ఐ-ప్యాక్' తో అఖిలేశ్ ఒప్పందం
 

by Suryaa Desk | Thu, Feb 26, 2026, 03:56 PM

రాజకీయాల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2027 ప్రారంభంలో జరగనున్నాయి. కానీ, అప్పుడే ఆ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలయింది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ భారీ స్కెచ్ వేశారు. వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా... దేశంలోనే అత్యంత విజయవంతమైన రాజకీయ వ్యూహకర్తల సంస్థ 'ఐ-ప్యాక్' (I-PAC)తో అఖిలేశ్ ఒప్పందం కుదుర్చుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ ఇచ్చిన సూచన మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేశారు. ఐ-ప్యాక్ వ్యూహాలతోనే బెంగాల్‌లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకే విజయాలు సాధించిన నేపథ్యంలో, అదే ఫార్ములాను యూపీలోనూ వర్తింపజేయాలని ఆయన నిర్ణయించారు. 

Latest News
Confident of my victory even in booth where Bengal CM, her nephew cast votes: Suvendu Adhikari Wed, Apr 29, 2026, 12:54 PM
Rahul Gandhi visits Gurdwara in Andaman's Campbell Bay; interacts with Sikh community members Wed, Apr 29, 2026, 12:52 PM
Massive blaze engulfs 8 flats in multi-storey building in Ghaziabad's Indirapuram Wed, Apr 29, 2026, 12:48 PM
Bengal polls: Voting picks up pace, 39.97 pc recorded in 1st four hours Wed, Apr 29, 2026, 12:47 PM
GCC leaders reject Iran's measures to close Strait of Hormuz Wed, Apr 29, 2026, 12:46 PM