Rail Parcel App: రైల్వేశాఖ పార్శిల్ సేవలు.. ఈ ఒక్క యాప్ మీ ఫోన్‌లో ఉంటే చాలు.. ఇంటి వద్ద నుంచే బుకింగ్..
 

by Suryaa Desk | Wed, Feb 25, 2026, 10:25 PM

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. రైల్వే తాజాగా Rail Parcel Booking Appను బుధవారం ప్రారంభించింది. హైదరాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈ యాప్‌ను అధికారికంగా లాంచ్ చేశారు.హైదరాబాద్ రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో రూపొందించబడిన ఈ యాప్ ద్వారా ప్రయాణికులు ఇప్పుడు కొత్త సౌకర్యాన్ని పొందవచ్చు. తక్కువ ఖర్చుతో పార్శిళ్లను పంపించుకోవడం, అలాగే పికప్ నుంచి డెలివరీ వరకు అన్ని సేవలను మొబైల్ యాప్ ద్వారా సులభంగా పొందవచ్చు.ప్రస్తుతానికి ఈ రైల్ పార్షిల్ సేవలు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. తొలుత హైదరాబాద్ డివిజన్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించబడిన యాప్ విజయవంతం కావడంతో, దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు ఈ సేవలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించింది. యాప్ ద్వారా పార్షిల్ బుకింగ్ చేయడం, డెలివరీ ట్రాకింగ్ చేయడం సులభం.వ్యాపారులకు కూడా ఈ యాప్ ద్వారా అవకాశాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మొబైల్ ద్వారా పికప్ బుకింగ్ చేసుకోవచ్చు. డెలివరీ ఎప్పుడు జరిగిందో కూడా యాప్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. పరిశ్రమలు, లాజిస్టిక్స్ భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకురావడంలో కూడా ఈ యాప్ ఉపయోగపడుతుంది.దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, “డిజిటల్ యుగంలో ఈ విప్లవాత్మక రైల్ పార్షిల్ యాప్‌ను అమలు చేసిన మొదటి జోన్‌గా దక్షిణ మధ్య రైల్వే గుర్తింపు పొందడం గర్వకారణం. ఈ యాప్ పార్షిల్ కార్యాలయాన్ని వినియోగదారుల దగ్గరికి తీసుకువస్తుంది. పొడవైన క్యూలలో నిలబడాల్సిన అవసరం, ఫారాలు పూరించాల్సిన సమస్యలను పూర్తిగా తొలగిస్తుంది” అని తెలిపారు.

Latest News
India's new strategic maritime hub takes shape at Great Nicobar Fri, May 01, 2026, 04:18 PM
India-Tanzania bilateral trade crosses $9 billion, set to grow further Fri, May 01, 2026, 04:17 PM
IPL 2026: When and Where to watch CSK vs MI, know all details Fri, May 01, 2026, 04:10 PM
Nitish Kumar vacates Bihar CM residence on Buddha Purnima Fri, May 01, 2026, 04:08 PM
US Navy's blockade of Iran hits China's cheap oil deals: Report Fri, May 01, 2026, 04:06 PM