ఏఐ సాంకేతికత వినియోగంతో స్వీయ ఆదాయం తగ్గినా ఫర్వాలేదన్న టీసీఎస్
 

by Suryaa Desk | Wed, Feb 25, 2026, 08:17 PM

కృత్రిమ మేధ పై టీసీఎస్ సీఈవో కృతివాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐ సాంకేతికతకు టీసీఎస్ భయపడదని వ్యాఖ్యానించారు. ఏఐ వల్ల సంభవించే మార్పులకు అనుగుణంగా కంపెనీ తన విధానాలను మార్చుకుంటోందని వెల్లడించారు. సంస్థ వార్షిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఏఐ సాంకేతికత వినియోగంతో స్వీయ ఆదాయం తగ్గినా ఫర్వాలేదని, వీటిని ఉపయోగించాలని సిబ్బందిని ప్రోత్సహిస్తున్నామని అన్నారు.ఏఐ ఆధారిత సాంకేతిక వినియోగంలో యువ నిపుణులతో పోలిస్తే సీనియర్ స్థాయి ఉద్యోగులు నెమ్మదిగా ఉన్నారని తెలిపారు. తమ కంపెనీకి చెందిన ఆరు లక్షల మంది ఉద్యోగులకు ఏఐ నైపుణ్యం ఉండాలని భావిస్తున్నామని అన్నారు. ఉద్యోగులు కూడా అందుకు అనుగుణంగా కష్టపడాలని సూచించారు. ఉపాధి అవకాశాలను నూతన సాంకేతికత దెబ్బతీస్తుందనే అంశంపై టీసీఎస్ భయపడదని తెలిపారు.

Latest News
Bangladesh measles outbreak: Four more children die; toll rises to 280 Sat, May 02, 2026, 01:30 PM
Trump ties Iran action to market resilience Sat, May 02, 2026, 01:22 PM
UN refugee agency warns Mideast crisis hampering aid effortsUN refugee agency warns Mideast crisis hampering aid efforts Sat, May 02, 2026, 01:07 PM
'Never been so fearful of a 15-year-old kid': Jamieson on Sooryavanshi Sat, May 02, 2026, 01:01 PM
Trinamool complains to EC against RO of counting centre alleging unauthorised sorting of postal ballots Sat, May 02, 2026, 12:56 PM