న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ.. పాఠశాలలు బంద్, ప్రయాణాలపై ఆంక్షలు
 

by Suryaa Desk | Tue, Feb 24, 2026, 07:52 PM

అమెరికా ఈశాన్య రాష్ట్రాలను భీకర శీతాకాలపు తుపాను వణికిస్తోంది. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా మంచు కురుస్తుండటంతో.. న్యూయార్క్ నగరం దాదాపు స్తంభించిపోయింది. సోమవారం తెల్లవారుజాము నుంచే భారీగా హిమపాతం కొనసాగుతుండటంతో న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ నగరంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రజల భద్రత దృష్ట్యా ప్రయాణాలపై కఠిన ఆంక్షలు విధించడంతో పాటు వేలాది విద్యా సంస్థలను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.


నేషనల్ వెదర్ సర్వీస్ (ఎన్‌డబ్ల్యూఎస్) నివేదిక ప్రకారం.. న్యూయార్క్‌లో ఇప్పటికే 14.9 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. మాన్హాటన్, బ్రూక్లిన్ వంటి ప్రాంతాలు పూర్తిగా మంచు దుప్పటిని కప్పుకున్నాయి. అత్యవసర సేవలు మినహా మరే ఇతర వాహనాలను నగర వీధులు, హైవేలు, వంతెనలపై అనుమతించడం లేదు. అలాగే మంచు ధాటికి విజిబిలిటీ పడిపోవడంతో దేశవ్యాప్తంగా సుమారు 5,600కు పైగా విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. బలమైన గాలుల కారణంగా న్యూజెర్సీ రాష్ట్రంలో సుమారు 1.2 లక్షల మంది అంధకారంలో చిక్కుకున్నారు.


ప్రభుత్వం హెచ్చరికలు..


న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ పరిస్థితి తీవ్రతపై ప్రజలను హెచ్చరించారు. "అసలైన ముప్పు ఇంకా ముందుంది. ప్రజలంతా ఇళ్లలోనే సురక్షితంగా ఉండండి. అవసరమైన మందులు, కిరాణా సామాగ్రిని ఇప్పుడే తెచ్చుకుని సిద్ధంగా ఉండండి" అని ఆమె సూచించారు. న్యూజెర్సీ గవర్నర్ మికీ షెరిల్ కూడా రాష్ట్రంలో ఎమర్జెన్సీని ప్రకటించి.. సహాయక చర్యల కోసం నిధులను విడుదల చేశారు. బోస్టన్ మేయర్ మిచెల్ వూ అన్ని ప్రభుత్వ పాఠశాలలు, మున్సిపల్ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.


నగరంలో ట్రావెల్ బ్యాన్ విధించడం పట్ల ఉద్యోగుల నుంచి అసహనం వ్యక్తం అవుతోంది. రోడ్లు మూసివేసినా కొన్ని ఆఫీసులు సెలవు ప్రకటించకపోవడంతో విధులకు ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదని స్థానికులు వాపోతున్నారు. మరోవైపు ఇతర దేశాల నుంచి వచ్చిన పర్యాటకులు మాత్రం న్యూయార్క్‌లో మొదటిసారి మంచు కురవడం చూసి సంబరపడుతున్నారు. టైమ్స్ స్క్వేర్ వంటి ప్రాంతాల్లో మంచుతో ఆడుకుంటూ పర్యాటకులు వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు. వారం రోజుల కిందట సంభవించిన శీతాకాలపు తుపాను కారణంగా అమెరికాలో 100 మందికి పైగా మరణించారు. మళ్లీ ఇప్పుడు అంతకంటే బలమైన తుపాను రావడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.


Latest News
Athapaththu among big movers, enters top three in T20I all-rounders rankings Tue, May 05, 2026, 02:32 PM
A day after victory, Suvendu Adhikari outlines new Bengal govt's development roadmap Tue, May 05, 2026, 02:15 PM
President's assurance on constitutional rights gives us strength: Raghav Chadha Tue, May 05, 2026, 02:12 PM
Stalin resigns as TN Chief Minister after DMK's defeat in Assembly polls Tue, May 05, 2026, 02:05 PM
From consensus to contest, Congress faces unprecedented leadership race in Kerala Tue, May 05, 2026, 01:50 PM