|
|
by Suryaa Desk | Tue, Feb 24, 2026, 06:04 PM
నగరి నియోజకవర్గం, పుత్తూరులో మంగళవారం దినసరి మార్కెట్, ప్రైవేట్ బస్టాండ్, జంతువధ శాలల రుసుము వసూలు హక్కులకు బహిరంగ వేలం పాట నిర్వహించారు. పట్టణ కమిషనర్ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం, దినసరి మార్కెట్ రూ. 20.6 లక్షలు, ప్రైవేట్ బస్టాండ్ రూ. 16.12 లక్షలు, జంతువధ శాల రూ. 5.65 లక్షలు పలికాయి. మొత్తం రూ. 42.37 లక్షల ఆదాయం రాగా, ఇది గతేడాది కంటే రూ. 1.11 లక్షలు అధికం.
Latest News