|
|
by Suryaa Desk | Tue, Feb 24, 2026, 03:10 PM
ఏపీ అసెంబ్లీలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీపై తీవ్ర చర్చ జరిగింది. ఈ కల్తీకి గత వైసీపీ పాలకులే కారణమని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని, కేవలం లడ్డూ విషయంలోనే కాకుండా అనేక విషయాల్లో వైసీపీ పాలకులు తప్పులు చేశారని ఆయన అన్నారు. ల్యాబ్ కళ్లుగప్పి టెండర్లు దక్కించుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో దాదాపు రూ. 234 కోట్ల నిధులు అక్రమాలకు గురయ్యాయని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
Latest News