డిమాండ్స్ నెరవేరకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం
 

by Suryaa Desk | Tue, Feb 24, 2026, 02:15 PM

కర్నూలు నగరంలో దీక్షా శిబిరంలో సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు మంగళవారం రెండో రోజు మాట్లాడుతూ, అంగన్వాడీల వేతన పెంపు, గ్రాట్యుటీ, పీఎఫ్-ఈఎస్ఐ, సూపర్వైజర్ పోస్టుల భర్తీ, మినీ సెంటర్లను మైన్ సెంటర్లుగా మార్చడం, వేసవి సెలవులు వంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీఐటీయూ శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ నిర్మల, జిల్లా కోశాధికారి గోపాల్, నగర అధ్యక్ష కార్యదర్శులు నగేష్, నరసింహులు, ఏఐటీయూసీ నగర అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్, వెంకటేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM