పేద పిల్లల ఆకలి తీర్చేందుకు అజ్ఞాత దాత గొప్ప మనసు.. రూ.87 కోట్ల భూరి విరాళం
 

by Suryaa Desk | Mon, Feb 23, 2026, 07:40 PM

ప్రపంచం వ్యాప్తంగా 50 లక్షల మంది చిన్నారులను ఆకలి నుంచి, పోషకాహార లోపం నుంచి బయట పడేయడానికి పవిత్ర రంజాన్ మాసంలో చేపట్టిన ‘ఎడ్జ్ ఆఫ్ లైఫ్’ కార్యక్రమానికి ఓ అజ్ఞాత దాత భూరి విరాళం ఇచ్చి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఆయన ఏకంగా 35 మిలియన్ దిర్హామ్‌లు (అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.87 కోట్లు) విరాళంగా అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో పోషకాహారలోప సమస్యను పరిష్కరించే కార్యక్రమాలకు ఒక బిలియన్ దిర్హామ్‌ (భారత కరెన్సీలో రూ.2,400 కోట్లు) నిధుల సేకరణే ఈ ప్రచారం ప్రధాన లక్ష్యం. రంజాన్ సందర్భంగా ‘ఎడ్జ్ ఆఫ్ లైఫ్’ ఇనీషియేటివ్‌ను దుబాయ్ పాలకుడు, ఆ దేశ వైస్-ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి షైక్ మహమూద్ బిన్ రషీద్ అల్ ముక్తమ్ ప్రారంభించారు.


చిన్నారుల ఆకలికి తాత్కాలిక ఉపశమనానికి బదులు దీర్ఘకాలిక పరిష్కారాలను సూచించే కార్యక్రమాలకు మద్దతు ఇచ్చేందుకు దీనిని చేపట్టారు. కనీసం ఒక బిలియన్ దిర్హామ్‌ల నిధులను సేకరించి, ప్రపంచవ్యాప్తంగా బలహీన వర్గాలకు చెందిన పిల్లల్లో పోషకాహార లోప నివారణ, వారి చికిత్సల కోసం రూపొందించిన కార్యక్రమాలకు సహకారం అందజేయాలని నిర్ణయించుకున్నారు. దుబాయ్ పాలకుల దీర్ఘకాలిక మానవతా సహాయకంగా కొనసాగింపుగా దీనిని రూపొందించారు. పిల్లల ఆకలికి తాత్కాలిక చర్యలకు బదులు దీర్ఘకాలిక నిరంతర నైతిక కార్యక్రమంగా దీనిని పరిగణిస్తారు.


మహమూద్ బిన్ రషీద్ అల్ ముక్తమ్ గ్లోబల్ ఇనీషియేటివ్‌లో భాగంగా ఈ పోగ్రామ్ పనిచేయనుంది. వ్యక్తులు, సంస్థలు, వ్యాపార సంస్థలను ఇందులో భాగస్వాములను చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా బలహీన వర్గాలకు సేవలందించే మానవతా కార్యక్రమాలకు సహకారం అందించడంతో యూఏఈ పాలకుల దాతృత్వానికి ఇది నిదర్శనం. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యునిసెఫ్‌)తో కలిసి ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేయనున్నారు. క్షేత్రస్థాయిలో ఫలితాలను రాబట్టేందుకు నైపుణ్యం, కార్యనిర్వాహక సహకారం అందజేయనుంది.


ఏంటీ ‘11.5’?


ఈ ఇనీషియేటివ్‌కు అనుబంధంగా ఉన్న 11.5 అనే సంఖ్య... 6 నెలల నుంచి ఐదేళ్ల వయస్సు గల పిల్లల్లో తీవ్ర పోషకాహార లోపాన్ని గుర్తించేందుకు ఉపయోగించే మోచేతి చుట్టుకొలత సూచిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. 11.5 సెం.మీ. కంటే తక్కువ ఉంటే తీవ్రమైన పోషకాహార లోపంగా నిర్ధారిస్తారు. మొదట్లో గుర్తింపు, జోక్యం అవసరాన్ని స్పష్టంగా తెలియజేయడానికి ఈ సంఖ్యను నిర్ణయించారు. కాగా, అధికారిక వెబ్‌సైట్ www.edgeoflife.ae లేదా 800 4999 టోల్‌ఫ్రీ నెంబరు వంటి వివిధ మార్గాల ద్వారా ఈ క్యాంపెయిన్‌కు విరాళాలను స్వీకరిస్తున్నారు.

Latest News
Deaths after C-Sec complications in Kota: Doctor and two nursing staff suspended Sat, May 09, 2026, 04:12 PM
Bengal saved from turning to 'Western Bangladesh': Minister Agnimitra Paul Sat, May 09, 2026, 04:11 PM
'Akhilesh Yadav has become tourist these days': BJP's Shahnawaz Hussain targets SP chief over Bengal visit Sat, May 09, 2026, 04:10 PM
Lankan newspapers carry front-page tributes for Pahalgam terror attack victims, honour 'Op Sindoor' Sat, May 09, 2026, 04:08 PM
American passengers aboard hantavirus-hit cruise ship to quarantine in Nebraska Sat, May 09, 2026, 04:05 PM