మద్యం లేకుండా వివాహం జరిపిస్తే రూ.51 వేలు గిఫ్ట్....వినూత్నంగా ఆలోచించిన ఓ గ్రామ సర్పంచ్
 

by Suryaa Desk | Sat, Feb 07, 2026, 08:14 PM

వేడుక ఏదైనా చుక్క, ముక్క ఉండాల్సిందే. ఇక, పెళ్లిళ్ల సమయంలో అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఒకప్పుడు పెళ్లిళ్లు అంటూ భోజనాలు, బాజాభజంత్రీలే. ఇప్పుడు మాత్రం వివాహా్ల్లో మద్యం ఏరులై పారుతుంది. యువతపై ఈ అలవాటు చెడు ప్రభావం చూపడమే కాదు... పేదలకు భారంగానూ మారుతోందనే వాదనలో నిజం లేకపోలేదు. దీంతో వివాహా వేడుకల్లో మద్యం కట్టడికి ఓ గ్రామ సర్పంచ్ వినూత్న ప్రయత్నం మొదలుపెట్టారు. మద్యం ఉపయోగించకుండా పెళ్లిచేసుకుంటే.. రూ.51 వేలు బహుమతి ఇస్తానని ప్రకటించారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం డోయీవాలా నియోజకవర్గం గడుల్‌ గ్రామానికి చెందిన సర్పంచ్‌ స్వీటీ రావత్‌ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.


వివాహం వేడుకల్లో మద్యం పంపిణీ చేయని కుటుంబానికి రూ.51వేలు ఇస్తానని ప్రకటించినట్టుగానే.. ఇప్పటికే రెండు కుటుంబాలకు ఆమె నగదు బహుమతి అందజేయడం విశేషం. తొలిసారి గతేడాది గ్రామానికి చెందిన జ్ఞాన్‌సింగ్ బిషత్ డిసెంబరు 1, 2025లో తన కుమార్తె పెళ్లికి చుక్క మద్యం కూడా పంపిణీ చేయలేదు. దీంతో ఆయనకు గ్రామ సర్పంచ్ రూ.51 వేలు బహుమతి ఇచ్చారు. తర్వాత ఫిబ్రవరి 5న దేవేంద్ర సింగ్ రావత్ కూడా తన కుమార్తె వివాహం సందర్భంగా మద్యం పార్టీ ఇవ్వలేదు. ఈ రెండు శుభకార్యాలు మందు పార్టీలు లేకుండా జరిపించి, రివార్డును అందుకున్నారు.


ఇక, వివాహాలు వంటి శుభకార్యాల్లో మద్యం పంపిణీతో వృథా ఖర్చులు పెరిగిపోతున్నాయని, మద్యానికి యువత బానిసగా మారడానికి కారణమవుతోందని స్వీటీ అన్నారు. ఇలాంటి ధోరణిని అరికట్టేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. ఇందుకు ప్రజల నుంచి తనకు సహకారం లభిస్తోందని పేర్కొన్నారు. సర్పంచ్ ప్రయత్నానికి జిల్లా కలెక్టర్‌ సహా పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.


అయితే, గతంలో తెహ్రి జిల్లాలోనూ ఇటువంటి ప్రయత్నమే జరిగింది. దేవ్‌ప్రయాగ్‌ గ్రామంలో మద్యం లేకుండా పెళ్లి వేడుకను నిర్వహిస్తే.. వధువుకు గిఫ్ట్‌గా రూ.10 వేలు నగదు ఇస్తామని స్థానిక పోలీసులు ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆ పోలీసులే తలో కొంత విరాళంగా పోగేసి బహుమతిగా ఇవ్వడం గమనార్హం.

Latest News
Pakistan must urgently reform or drift into 'managed decline' by 2031 Sun, Mar 01, 2026, 05:53 PM
'Khamenei's assassination may not ensure regime change, cause global economic fallout' Sun, Mar 01, 2026, 05:35 PM
Ayatollah Arafi named Iran's interim Supreme Leader Sun, Mar 01, 2026, 05:27 PM
TCS' market cap falls over Rs 18,000 crore last week Sun, Mar 01, 2026, 05:22 PM
GST collections rise 8.1 pc to Rs 1.83 lakh crore in February Sun, Mar 01, 2026, 05:10 PM