|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 07:24 PM
ఆమెకు 37 ఏళ్లు, అతడికి 17 ఏళ్లు.. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అక్కడితో ఆగకుండా 20 ఏళ్లు చిన్నవాడైన ఆ కుర్రాడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వివాహేతర సంబంధానికి భర్త, అత్త అడ్డుగా ఉన్నారని ఆ వివాహిత భావించింది.. ఇద్దరిని అడ్డు తొలగించుకుంటే ఇబ్బంది లేకుండా పోతుందని ప్లాన్ చేసింది. ఆ కుర్రాడికి చెప్పి భర్తతో పాటుగా అత్తను హత్య చేయాలని రెచ్చగొట్టింది. ఆ కుర్రాడు కూడా కత్తితో వివాహిత అత్తను చంపేందుకు వెళ్లాడు.. ఆమెపై దాడి చేశాడు. ఇంతలో చుట్టుపక్కల వారు రావడంతో ప్లాన్ బెడిసికొట్టి అతడు దొరికిపోయాడు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలంరేపింది.
చిత్తూరు జిల్లా చామంతిపురానికి చెందిన కవిత వయస్సు 37 ఏళ్లు.. ఆమెకు 17 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు 14, 15 ఏళ్లు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కవితకు అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పడింది.. అది కాస్త ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే కవిత ఘనకార్యం గురించి తెలుసుకున్న భర్త విజయ్ పలు సందర్భాల్లో మందలించాడు. భార్యాభర్తల మధ్య వాగ్వాదం కూడా జరిగినట్లు చెబుతున్నారు.
ఇటీవల మరోసారి భర్త కవితను హెచ్చరించాడు.. అయినా సరే ఆమె మాత్రం పద్ధతి మార్చుకోలేదు. అప్పుడు భర్త, అత్తపై కోపం పెంచుకుంది.. వారిని అడ్డు తొలగించుకోవాలని భావించింది. వాళ్లిద్దర్ని చంపేయాలని మైనర్ బాలుడిని కవిత రెచ్చగొట్టింది. మైనర్ బాలుడు ఫిబ్రవరి 5న రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న అత్త నిర్మలపై దాడికి పాల్పడ్డాడు. ఆమె కళ్లల్లో కారం కొట్టి, కత్తితో గొంతు కోసి హత్య చేయడాని ప్రయత్నించాడు. నిర్మల బాలుడ్ని ప్రతిఘటించి పెద్దగా కేకలు వేసింది. వెంటనే చుట్టుపక్కల జనాలు పరుగెత్తుకొచ్చారు. వాళ్లను చూసి ఆ బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు. నిర్మల గొంతుపై తీవ్ర గాయం కావడంతో వెంటనే స్థానికులు ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడైన బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కవిత రెచ్చగొట్టడంతోనే మైనర్ బాలుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. కవిత మాత్రం పరారీలో ఉంది.. పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.
Latest News