|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 04:02 PM
ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత శివసేన పట్టు తప్పి, ముంబై మేయర్ పీఠంపై బీజేపీ జెండా ఎగిరింది. ఇటీవల జరిగిన బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘనవిజయం సాధించినప్పటికీ, మేయర్ ఎంపికపై బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య గత నెల రోజులుగా తీవ్ర చర్చలు జరిగాయి. చివరకు మేయర్ పదవిని బీజేపీ దక్కించుకోగా, డిప్యూటీ మేయర్ పదవి శివసేనకు కేటాయించారు. మేయర్‌గా బీజేపీ సీనియర్ నేత రీతూ తాన్డే, డిప్యూటీ మేయర్‌గా శివసేన కౌన్సిలర్ సంజయ్ ఘడి ఎన్నికయ్యారు.రీతూ తాన్డే బీజేపీలో సీనియర్ నాయకురాలిగా గుర్తింపు పొందారు. ఇటీవల జరిగిన బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో గహత్కోపర్ నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందారు.
ఇదే నియోజకవర్గం నుంచి ఆమె మూడుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. గతంలో విద్యా కమిటీ ఛైర్మన్‌గా కూడా పని చేసిన అనుభవం ఆమెకు ఉంది.
ఈ అనుభవం బీఎంసీ అభివృద్ధికి ఉపయోగపడుతుందన్న అంచనాతో బీజేపీ ఆమె పేరును మేయర్ పదవికి ప్రతిపాదించింది.
పార్టీ హైకమాండ్‌తో చర్చించిన అనంతరం రీతూ తాన్డే నియామకానికి ఆమోదం లభించినట్లు తెలుస్తోంది.
అదే సమయంలో డిప్యూటీ మేయర్‌గా దహిసర్ కౌన్సిలర్, ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన సంజయ్ ఘడి ఎన్నికయ్యారు. ఈ నిర్ణయంతో ముంబై మున్సిపల్ పాలనలో బీజేపీ-శివసేన మధ్య అధికార పంపకం స్పష్టమైంది.
Latest News