భారత వస్తువులపై 18 శాతానికి సుంకాలు తగ్గించిన యూఎస్
 

by Suryaa Desk | Sat, Feb 07, 2026, 09:18 AM

భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ ఇరు దేశాలు కీలకమైన మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంలో భాగంగా భారత వస్తువులపై అమెరికా తన సుంకాలను 18 శాతానికి తగ్గించింది. గతంలో విధించిన అదనపు 25 శాతం సుంకాన్ని కూడా ఉపసంహరించుకోవడం గమనార్హం. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య వాణిజ్యానికి కొత్త ఊతాన్ని ఇవ్వనుంది.ఈ ఒప్పందం ప్రకారం అమెరికా నుంచి దిగుమతి అయ్యే పలు పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు వ్యవసాయ, ఆహార వస్తువులపై భారత్ సుంకాలను తగ్గించడం లేదా పూర్తిగా తొలగించనుంది. ఇందులో డ్రైడ్ డిస్టిలర్స్ గ్రెయిన్స్, పశువుల దాణా కోసం ఉపయోగించే ఎర్ర జొన్నలు, నట్స్, పండ్లు, సోయాబీన్ నూనె, వైన్, స్పిరిట్స్ వంటివి ఉన్నాయి. అదే సమయంలో భారత్ నుంచి ఎగుమతి అయ్యే టెక్స్‌టైల్స్, దుస్తులు, లెదర్, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బరు, ఆర్గానిక్ కెమికల్స్, గృహాలంకరణ వస్తువులు, చేతివృత్తి ఉత్పత్తులపై అమెరికా 18 శాతం సుంకాన్ని వర్తింపజేస్తుంది.సుంకాలతో పాటు వాణిజ్యానికి అడ్డంకిగా ఉన్న నాన్-టారిఫ్ బ్యారియర్స్ ను కూడా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ముఖ్యంగా అమెరికా వైద్య పరికరాలకు భారత మార్కెట్‌లో ప్రవేశాన్ని సులభతరం చేయడంతో పాటు యూఎస్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ  వస్తువులపై ఉన్న దిగుమతి లైసెన్సింగ్ నిబంధనలను భారత్ రద్దు చేయనుంది.ఈ ఒప్పందంలో మరో ముఖ్యమైన అంశం రాబోయే ఐదేళ్లలో భారత్ అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొనుగోలు చేయనుంది. ఇందులో ఇంధనం, విమానాలు, వాటి విడిభాగాలు, విలువైన లోహాలు, సాంకేతిక ఉత్పత్తులు వంటివి ఉంటాయి. ఈ మధ్యంతర ఒప్పందం పూర్తిస్థాయిలో అమలైతే, భారత జనరిక్ మందులు, వజ్రాలు, విమాన భాగాలపై ఉన్న సుంకాలను కూడా అమెరికా ఎత్తివేయనుంది. పూర్తిస్థాయి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం  కోసం చర్చలు కొనసాగిస్తామని, భవిష్యత్తులో మరిన్ని సుంకాల తగ్గింపును పరిశీలిస్తామని ఇరు దేశాలు ప్రకటించాయి

Latest News
Ranji Trophy Final: Yawer, Pundir's fifties take J&K to 178/2 at tea against Karnataka on Day 1 Tue, Feb 24, 2026, 04:14 PM
Cartel boss killing sparks chaos in Mexico Tue, Feb 24, 2026, 03:55 PM
Bomb threat email triggers panic at Bengal court, hoax suspected Tue, Feb 24, 2026, 03:46 PM
Three members of a family die by suicide in Hyderabad Tue, Feb 24, 2026, 03:42 PM
Five Baloch civilians forcibly disappeared at the hands of Pakistani forces Tue, Feb 24, 2026, 02:29 PM