నల్ల నువ్వులు మినప్పొడి పొడికూడా ట్రై చేయండి,,,, ఎంతో హెల్దీ కూడా
 

by Suryaa Desk | Fri, Feb 06, 2026, 11:31 PM

పొడులు.. ఇవి మన వంటల్లో ఓ భాగం. వేడివేడి అన్నంలో కాస్తా పొడి వేసి నెయ్యితో కలిపి తింటే అమోఘంగా ఉంటుంది. వీటిని మనం ఇడ్లీ వంటి టిఫిన్స్‌లో కూడా నంజుకుని తింటాం. ఇలాంటి పొడులన్నీ కూడా మనం కాస్తా హెల్దీగా చేయాలంటే కొత్త కొత్త ప్రయోగాలు చేయాల్సిందే. కానీ, ఇప్పుడు అలాంటి ప్రయోగాలు లేకుండానే చెఫ్ మనకి మంచి పొడి రెసీపిని షేర్ చేసుకున్నారు చెఫ్ విన్నీ శుక్లా. ఇన్‌స్టాలో షేర్ చేసుకున్న ఆ రెసిపీ గురించి మీరూ తెలుసుకోండి. క్షణాల్లోనే రెడీ అయ్యే ఈ పొడి ఎంతో రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. నల్ల నువ్వులు, నల్ల మినపప్పుతో ఈ పొడి ఎలా తయారుచేయాలంటే


కావాల్సిన పదార్థాలు


నల్ల నవ్వులు అరకప్పు


​నల్ల మినపప్పు ముప్పావు కప్పు


జీలకర్ర టేబుల్ స్పూన్


నల్ల మిరియాలు అరటీస్పూన్


వెల్లుల్లి రెబ్బలు 6


ఎండు మిరిపకాయలు 8


ఇంగువ అర టీస్పూన్


కరివేపాకు గుప్పెడు


చింతపండు 3 అంగుళాలు


నూనె 1 టీస్పూన్


ఉప్పు రుచికి సరిపడా


తయారుచేసే విధానం


ఓ పాన్ తీసుకుని స్టౌపై పెట్టండి. వేడి అవ్వగానే నల్ల నువ్వులు వేసి కాస్తా చిటపటలాడించండి. తర్వాత వాటిని పక్కన పెట్టండి.


అదేపాన్‌లో నల్ల మినపప్పు వేసి కొద్దిగా రంగు మారేవరకూ సిమ్‌లోనే దోరగా వేయంచండి. సుమారు 8 నుంచి 10 నిమిషాల పాటు వేయించి పక్కనపెట్టండి.


పాన్‌లో టీస్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, నల్ల మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, చింతపండు, కరివేపాకు అన్నీ వేసి కలపండి. అన్నింటినీ క్రిస్పీగా మారేవరకూ వేయించండి.


వేయించిన పదార్థాలన్నింటినీ నల్లనువ్వులు, మినపప్పులో కలిపి, ఇంగువ, ఉప్పు కలపండి.


పూర్తిగా ఆరిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా కాకుండా కాస్తా బరకగానే మిక్సీ పట్టండి.


ఎలా ఎంజాయ్ చేయొచ్చు. 


నల్లనువ్వులు, నల్ల మినపప్పుతో తయారుచేసిన ఈ పొడి చాలా టేస్టీగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది. హ్యాపీగా వేడివేడి అన్నం, టిఫిన్స్‌లోకి తినొచ్చు. అంతేకాకుండా, వీటిని మనం ఏదైనా వేపుళ్ళు, రసాలు చేసినప్పుడు అందులో కూడా వేయొచ్చు. అయితే, బాగుంది కదా అని ఎక్కువ పరిమాణం వద్దు. క్వాంటిటీని చూసి వేసుకోండి. ఎప్పుడూ కూరలు, చారు తిని బోర్ కొట్టిందని ఫీల్ అయ్యేవారు ఈ పొడిని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు.


నల్ల నువ్వులలోని పోషకాలు


నల్ల నువ్వుల్లో పుష్కలగా పోషకాలు ఉంటాయి. అవి మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఎముకలకి మంచిది. జీర్ణ సమస్యల్ని దూరం చేస్తాయి. అంతేకాకుండా స్కిన్ అండ్ హెయిర్‌కి చాలా మంచిది. ఇందులో కాల్షియం, ఐరన్, మెగ్నీషియంలతో పాటు హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా బ్లడ్ ప్రెజర్‌ని, కొలెస్ట్రాల్, హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేస్తాయి.


నల్లనువ్వులు, నల్ల మినపప్పుతో పొడి


నల్ల మినపప్పుతో లాభాలు


మినపప్పు కూడా మంచి పోషకాలతో నిండి ఉన్న పప్పు. ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, మెగ్నీషియంలతో పాటు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జీర్ణ సమస్యల్ని దూరం చేయడమే కాకుండా, శక్తిని పెంచుతుంది. ఎముకలకి చాలా మంచిది. కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో, బ్లడ్ షుగర్‌ని మేనేజ్ చేయడంలో మినపప్పు హెల్ప్ చేస్తుంది. కండరాల బలం కోసం మినపప్పు చాలా బాగా హెల్ప్ చేస్తుంది.

Latest News
Ranji Trophy Final: Yawer, Pundir's fifties take J&K to 178/2 at tea against Karnataka on Day 1 Tue, Feb 24, 2026, 04:14 PM
Cartel boss killing sparks chaos in Mexico Tue, Feb 24, 2026, 03:55 PM
Bomb threat email triggers panic at Bengal court, hoax suspected Tue, Feb 24, 2026, 03:46 PM
Three members of a family die by suicide in Hyderabad Tue, Feb 24, 2026, 03:42 PM
Five Baloch civilians forcibly disappeared at the hands of Pakistani forces Tue, Feb 24, 2026, 02:29 PM