|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 08:21 PM
భారతదేశ రైల్వే వ్యవస్థలో ఆధునికతను, సౌకర్యాన్ని అందిస్తున్న వందే భారత్ రైళ్ల ఆటోమేటిక్ డోర్లు ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రైలు బయలుదేరే సమయానికి డోర్లు వాటంతట అవే మూసుకుపోవడం వల్ల కొందరు ప్రయాణికులు రైలు ఎక్కలేకపోతున్నారు లేదా దిగలేకపోతున్నారు. అయితే చివరి బోగీలోని గార్డ్ డోర్ తెరిచి ఉంటుందని, దాని ద్వారా ప్రయాణికులు రైలు ఎక్కవచ్చని లేదా దిగవచ్చు. ప్రయాణికులు ముందుగానే డోర్ వద్దకు చేరుకోవడం ఉత్తమం.ప్రస్తుతం భారతదేశంలో అత్యంత వేగంగా నడిచే రైలు వందే భారత్. స్వదేశీ సాంకేతికతతో తయారుచేసిన ఈ రైలును 2019 నుండి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది మోదీ సర్కార్. కేవలం స్పీడ్ మాత్రమే కాదు సాధారణ రైళ్లకంటే మెరుగైన సౌకర్యాలు ఉంటాయి. సౌకర్యవంతమైన సీటింగ్ కలిగి ఉంటుంది. అలాగే ప్రయాణికులకు, వైఫై, నాణ్యమైన ఫుడ్, మరింత భద్రత లభిస్తుంది. ఈ రైలు మరో ప్రత్యేకత ఏంటంటే అటోమేటిక్ ప్లగ్ డోర్లు.
Latest News