|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 03:54 PM
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత ఆటగాడు వైభవ్ సూర్యవంశీ శతకంతో అదరగొట్టాడు. శుక్రవారం హరారే వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ కేవలం 55 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఈ శతకంతో అండర్-19 ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో వైభవ్ రెండో స్థానంలో నిలిచాడు. విల్ మలాజ్‌జుక్ (ఆస్ట్రేలియా) 51 బంతుల్లో, ఖాసిం అక్రమ్ (పాకిస్తాన్) 63 బంతుల్లో, బెన్ మేయెస్ (ఇంగ్లాండ్) 65 బంతుల్లో, రాజ్ బావా (భారత్) 69 బంతుల్లో సెంచరీలు చేశారు. విల్ మలాజ్‌జుక్ ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన అతడు ఈ ఎడిషన్‌లోనే జపాన్ పై 51 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
Latest News