|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 02:16 PM
భారతీయ వంటకాల్లో రుచిని పెంచడమే కాకుండా, ఉల్లిపాయలు అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయలలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి జలుబు, దగ్గు, సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి. గుండె ఆరోగ్యానికి, కొలెస్ట్రాల్ నియంత్రణకు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు, జీర్ణక్రియ మెరుగుపరచడానికి, అందమైన చర్మం, ఒత్తైన జుట్టు కోసం ఉల్లిపాయలు మేలు చేస్తాయని వైద్యులు వివరించారు
- ఉల్లి రసం, తేనే కలిపి ఒక స్పూన్ మోతాదు చొప్పున రోజూ ఉదయం, సాయంత్రం తీసుకుంటే బీపీ నియంత్రణలో ఉంటుంది.
- ఉల్లిపాయ, కీరదోస, టమాట, క్యారెట్, కొత్తిమీరను ముక్కలుగా కోసి మిక్సీలో వేసి పేస్టులా చేయాలి. తర్వాత ఈ పేస్టుకి నిమ్మ రసం జత చేసి రోజులో ఒకసారి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల జీర్ణ కోశం శుభ్రమవుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
- మధుమేహంతో బాధపడేవారు ఉల్లి రసంలో తేనె కలుపుకుని రోజూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
- భోజనం చేసిన తర్వాత ఉల్లి కాడలను నమిలితే నోటి దుర్వాసన తగ్గుతుంది. ఆకలి బాగా అవుతుంది.
- రెండు స్పూన్ల ఉల్లి రసం, 2 స్పూన్ల తేనె, ఒక టీ స్పూన్ అల్లం రసం తీసుకోవాలి. ఈ మూడింటిని బాగా కలిపి రోజూ భోజనం తర్వాత తాగాలి. ఇలా చేయడం వల్ల ఆయాసం, దగ్గు తగ్గుతాయి.
Latest News