షుగర్, గుండె సమస్యలకి కారణమయ్యే విసెరల్ ఫ్యాట్ బాడీలో
 

by Suryaa Desk | Thu, Feb 05, 2026, 10:20 PM

బాడీలో ఫ్యాట్ పెరిగితే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీని వల్ల చాలా సమస్యలొస్తాయి. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్. ఇది చాలా మందికి ఉండే సమస్యే. అయితే, బెల్లీ అనగానే అందరికీ ప్రమాదం కాదు. దానిని మనం సరైన విధంగా చెక్ చేసుకుని అప్పుడే మనకి బాడీలో బెల్లీ ఎంత పెరిగింది. ఎంత ఉంటే సమస్య ఉంటుందో అనేది తెలుస్తుంది. దీనికోసం బెల్లీని మనం సరైన విధంగా ఎలా చెక్ చేసుకోవాలంటే


టేప్‌తో వెయిట్ సర్కమ్‌ఫెరెన్స్‌ని ఎలా చెక్ చేయాలి?


​బెల్లీ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అనేది తెలుసుకోవడానికి టేప్ తీసుకుని రిబ్ కేజ్ చుట్టూ కొలవండి. దీనినే వెయిట్ సర్కమ్‌ఫెరెన్స్ అంటారు. తర్వాత అదే టేప్‌తో హిప్‌లో లావుగా ఉన్న చోట మెజర్ చేయండి. దీనినే హిప్ సర్కమ్‌ఫెరెన్స్ అంటారు.


రెండింటి వాల్యూస్‌ని డివైడ్ చేయండి


మీరు రెండింటి వాల్యూస్‌ని నోట్ చేసి పెట్టుకున్న తర్వాత వెయిట్ సర్కమ్‌ఫెరెన్స్‌ని హిప్ సర్కమ్‌ఫెరెన్స్‌తో డివైడ్ చేయండి. దీనినే వెయిస్ట్ : హిప్ రేషియో అంటారు. ఈ రేషియోని బట్టే మనకి మన బాడీలో విసెరల్ ఫ్యాట్‌‌ గురించి తెలుసుకోవచ్చు. అదెలా అంటే


అమ్మాయిలు, అబ్బాయిల వాల్యూస్ ఎలా ఉండాలంటే 


ఫైనల్ వాల్యూ అనేది అమ్మాయిలకైతే 0.85 కంటే తక్కువగా ఉండాలి. అదే అబ్బాయిలకైతే 0.9 కంటే తక్కువగా ఉండాలి. ఈ వాల్యూస్ కంటే ఎక్కువగా వాల్యూ ఉంటే మన బాడీలో విసెరల్ ఫ్యాట్ ఎక్కువగా ఉన్నట్లని నాగార్జున చెబుతున్నారు. కాబట్టి, జాగ్రత్తగా టేప్‌తో ఈ వాల్యూస్‌ని చెక్ చేసుకుని రాయండి.


విసెరల్ ఫ్యాట్ అంటే


విసెరల్ ఫ్యాట్ అనేది మన బాడీలోని అవయవాల చుట్టూ ఉండే డేంజరస్ ఫ్యాట్. ఇది మన బాడీలో ఎన్నో సమస్యలకి కారణమవుతుంది. సాధారణంగా బాడీలో రెండు రకాల ఫ్యాట్స్ ఉంటాయి. అందులో మనం బెల్లీని పట్టుకుని లాగినప్పుడు వచ్చే ఫ్యాట్‌ని సబ్‌క్యూటెనెస్ ఫ్యాట్ అంటారు. ఇది మన స్కిన్ కింద ఉంటుంది. అలానే మన చేతికి దొరకని, కంటికి కనిపించని ఫ్యాట్‌నే విసెరల్ ఫ్యాట్ అంటారు. ఈ ఫ్యాట్ మన బాడీలో అవయవాల చుట్టూ ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే డేంజరస్ ఫ్యాట్ అని చెప్పొచ్చు.


విసెరల్ ఫ్యాట్‌తో వచ్చే సమస్యలు


ఈ విసెరల్ ఫ్యాట్‌తో మనకి డయాబెటిస్, గుండె సమస్యలు, హార్మోనల్ ప్రాబ్లమ్స్, ఇన్‌ఫ్లమేషన్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలొస్తాయి. ఈ విసెరల్ ఫ్యాట్‌ని తగ్గించుకోకపోతే ఇలాంటి ప్రమాదకర సమస్యలన్నీ వస్తాయి. కాబట్టి, ఈ ఫ్యాట్‌ని ఎప్పటికప్పుడు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దీనికోసం మనమేం చేయాలంటే


విసెరల్ ఫ్యాట్ తగ్గేందుకు ఏం చేయాలి?


బాడీలోని విసెరల్ ఫ్యాట్ తగ్గేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో


స్ట్రెంథ్ ట్రైనింగ్ చేయాలి. వారానికి కనీసం 3, 4 సార్లైనా స్ట్రెంథ్ ట్రైనింగ్ చేయాలి.


కేలరీలని తగ్గించి తీసుకోవాలి.


బ్యాలెన్స్డ్ మీల్ అంటే ప్రోటీన్, కార్బ్, ఫైబర్ ఉండేలా మీల్ ప్లాన్ చేసుకోవాలి.


ప్రతీరోజూ 8 వేల నుండి 10 వేల అడుగులు నడవాలి.


ఆల్కహాల్‌ని తగ్గించాలి. వీలైతే పూర్తిగా మానేయడం బెటర్.


ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి మనంగా మన బాడీలో వచ్చే డయాబెటిస్ వంటి ప్రమాదకర సమస్యల్నీ దూరం చేసుకోవచ్చు.


 

Latest News
PM Modi, French President Macron begin talks in Mumbai Tue, Feb 17, 2026, 04:43 PM
Reels, speed and a deadly crash: Mother seeks accountability after minor kills her son in Delhi Tue, Feb 17, 2026, 04:42 PM
Pakistan: Police arrests 35 Afghan migrants during raids in Peshawar Tue, Feb 17, 2026, 04:07 PM
Karpoori Thakur's death anniv: Patna municipal corporation removes banners ahead of RJD event Tue, Feb 17, 2026, 04:03 PM
French President Macron pays tribute to victims of 2008 Mumbai terror attacksFrench President Macron pays tribute to victims of 2008 Mumbai terror attacks Tue, Feb 17, 2026, 03:51 PM