|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 08:20 PM
Vivo V70 మరియు V70 Elite స్మార్ట్‌ఫోన్లు ఇండియన్ మార్కెట్‌లోకి రానున్నట్లు గత వారం చివర్లో వివో టీజర్ విడుదల చేసింది. తాజాగా, ఈ అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌కు సంబంధించిన లాంచ్ డేట్‌ను కూడా కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో విడుదల కానున్న ఫోన్లు సరికొత్త డిజైన్‌తో పాటు ఆకట్టుకునే ఫీచర్లతో వస్తాయని వివో వెల్లడించింది. ఈ అప్‌కమింగ్ Vivo స్మార్ట్‌ఫోన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.Vivo V70 మరియు Vivo V70 Elite స్మార్ట్‌ఫోన్లను ఫిబ్రవరి 19వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ చేయనుంది. ఈ లాంచ్ డేట్ మరియు టైమ్‌ను కంపెనీ అధికారికంగా కన్ఫర్మ్ చేయడంతో పాటు, ఈ ఫోన్లకు సంబంధించిన కీలక ఫీచర్లను కూడా రివీల్ చేసింది. వివో ఈ అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ZEISS ఆప్టిక్స్‌తో అందించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ సిరీస్‌లోని ఫోన్లు క్వాల్కమ్ లేటెస్ట్ ప్రాసెసర్ Snapdragon 8s Gen 3 చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. పనితీరును మరింత మెరుగుపరచేందుకు LPDDR5X ర్యామ్ మరియు UFS 4.1 ఫాస్ట్ స్టోరేజ్‌ను కూడా ఇందులో అందించారు.Vivo V70 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్‌తో వచ్చి, సింపుల్ అయినప్పటికీ ప్రీమియం లుక్ ఇచ్చే స్లీక్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. విజువల్ అనుభవాన్ని మెరుగుపరచేలా 1.5K రిజల్యూషన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను అందించారు. ఈ డిస్‌ప్లే గరిష్టంగా 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌ను సపోర్ట్ చేస్తుంది.కెమెరా విభాగంలో, Vivo V70 సిరీస్ ఫోన్లు వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు ముందు పంచ్-హోల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటాయి. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 50MP ZEISS మెయిన్ సెన్సార్, ZEISS అల్ట్రా వైడ్ లెన్స్ మరియు 50MP ZEISS నైట్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 50MP హై-రిజల్యూషన్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ ఫోన్ 60FPS వద్ద 4K వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తూ, అద్భుతమైన జూమ్ క్లారిటీని అందిస్తుంది. అంతేకాదు, అనేక Vivo కెమెరా ఫిల్టర్లు మరియు లేటెస్ట్ AI ఆధారిత కెమెరా ఫీచర్లతో ఈ ఫోన్ వస్తుంది.బ్యాటరీ పరంగా, ఈ అప్‌కమింగ్ Vivo స్మార్ట్‌ఫోన్‌లో 6500mAh బ్లూ వోల్ట్ బ్యాటరీని అందించారు. ఈ బ్యాటరీకి 90W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ కలర్ OSపై పనిచేస్తూ, 6 సంవత్సరాల పాటు రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్‌ను అందుకుంటుందని కంపెనీ తెలిపింది.
Latest News