'నువ్వో చెత్త రిపోర్టర్‌వి, నీ ముఖంలో ఒక్కసారి కూడా నవ్వు చూడలేదు': మహిళా జర్నలిస్టుతో ట్రంప్
 

by Suryaa Desk | Thu, Feb 05, 2026, 08:12 PM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా ఓ మహిశా జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. ఇష్టం పచ్చినట్లుగా మాట్లాడి ఆమెను అవమాన పరిచారు. మంగళవారం ఓవల్ ఆఫీస్‌లో జరిగిన మీడియా సమావేశంలో సీఎన్‌ఎన్ కరస్పాండెంట్ కైట్లాన్ కాలిన్స్ ఎప్‌స్టీన్ ఫైల్స్‌ గురించి ట్రంప్‌ను ప్రశ్నించారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ట్రంప్.. నేరుగా సమాధానం చెప్పలేక, ఆమె ముఖ కవళికలపై వ్యక్తిగత విమర్శలు చేసి సంచలనం సృష్టించారు.


వివాదానికి కారణమైన 'ఎప్‌స్టీన్ ఫైల్స్'


అమెరికాలో అతిపెద్ద కుంభకోణం అయిన సెక్స్ కుంభకోణం ప్రధాన నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన రహస్య పత్రాలను జస్టిస్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మగళవారం రోజు ఓవల్ ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో.. ఈ పత్రాల్లోని కీలక సమాచారాన్ని అధికారులు తొలగించారని, దీనివల్ల ఎప్‌స్టీన్ బాధితులకు న్యాయం జరగడం లేదని కాలిన్స్ ట్రంప్‌ను నిలదీశారు. "న్యాయం జరగలేదని భావిస్తున్న ఆ బాధితులకు మీరు ఏం చెబుతారు?" అని ఆమె సూటిగా ప్రశ్నించారు.


ఈ ప్రశ్నకు ట్రంప్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. అయితే సమాధానం చెప్పడం ఇష్టం లేక పోతే మాట్లాడకుండా ఉన్నా బాగుండేది. లేదా బాధితుల గురించి ఏమైనా మాట్లాడిన అయిపోయేది. కానీ ట్రంప్ మాత్రం రిపోర్టర్ వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తూ.. "నీతో నాకు పదేళ్ల పరిచయం ఉంది. కానీ నీ ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు చూడలేదు. నువ్వు ఎందుకు నవ్వడం లేదో తెలుసా? నువ్వు నిజం చెప్పడం లేదని నీకే తెలుసు కాబట్టి. మీది ఒక నిజాయితీ లేని సంస్థ. నువ్వో చెత్త రిపోర్టర్‌వి. నిన్ను చూసి సీఎన్‌ఎన్ సిగ్గుపడాలి" అంటూ విరుచుకుపడ్డారు.


మహిళా జర్నలిస్టులపై ట్రంప్ వైఖరి..


ట్రంప్.. జర్నలిస్టులపై, ముఖ్యంగా మహిళా రిపోర్టర్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా కాలిన్స్‌ను ఉద్దేశించి తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో స్టుపిడ్ అండ్ నాస్టీ అని విమర్శించారు. మరికొన్ని సందర్భాల్లో కూడా ఆయన హద్దులు దాటారు. గతేడాది ఓ రిపోర్టర్ ప్రశ్న అడుగుతుంటే క్వైట్ పిగ్గీ అంటూ ఆమె నోరు మూయించారు. ఫ్లోరిడాలో ఓ విలేకరిని "నువ్వేమైనా పిచ్చివాడివా? నీకు బుద్ధి ఉందా?" అంటూ గద్దించారు. తన వయస్సుపై కథనం రాసిన న్యూయార్క్ టైమ్స్ రచయిత్రిని అగ్లీ అని పిలిచి విమర్శలు కొనితెచ్చుకున్నారు.


సీఎన్‌ఎన్ స్పందన


ఈ ఘటనపై సీఎన్‌ఎన్ సంస్థ స్పందిస్తూ కైట్లాన్ కాలిన్స్‌కు పూర్తి మద్దతు ప్రకటించింది. ఆమె ఒక అసాధారణమైన జర్నలిస్టు అని, ఎంతో పట్టుదలతో, లోతైన అవగాహనతో వార్తలను నివేదిస్తుందని కొనియాడింది. ఎంటర్‌టైన్‌మెంట్ రిపోర్టర్‌గా ప్రస్థానం మొదలుపెట్టిన కాలిన్స్.. నేడు వైట్ హౌస్ కరస్పాండెంట్‌గా ఎదిగారని చెప్పింది. అలాంటి మహిళా జర్నలిస్టుపై ట్రంప్ ఇలా మాట్లాడడం తగదని.. వెంటనే ఆమెకు క్షణాపణ చెప్పాలని కోరింది.

Latest News
PM Modi to inaugurate AI Impact Expo 2026 on Monday Sun, Feb 15, 2026, 03:58 PM
India-Pak T20 clash: BJP expresses confidence in victory, Cong slams match with terror state Sun, Feb 15, 2026, 03:57 PM
T20 WC: Holder, Hope help Windies beat Nepal by 9 wickets, seal Super 8 spot Sun, Feb 15, 2026, 03:35 PM
India-Pak T20 WC clash: From Bihar to Gujarat, excited fans cheer for Team India Sun, Feb 15, 2026, 03:34 PM
T20 WC: Netravalkar returns as USA opt to bat against Namibia Sun, Feb 15, 2026, 03:00 PM