నోటిఫికేషన్‌తోపాటు కొత్త రూల్స్ తెచ్చిన యూపీఎస్సీ
 

by Suryaa Desk | Thu, Feb 05, 2026, 07:47 PM

సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామ్ రాయాలని అనుకుంటున్నారా? ఐఏఎస్, ఐపీఎస్ మీ లక్ష్యమా..? అయితే మీకో అప్డేట్.. యూపీఎస్సీ సీఎస్ఈ ప్రిలిమ్స్ 2026 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 933 ఖాళీలను భర్తీ చేయనుండగా.. ఫిబ్రవరి 24లోగా ప్రిలిమ్స్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ జారీ చేసిన సమయంలోనే.. కమిషన్ కొత్త రూల్స్‌ను సైతం ప్రకటించింది. ఇప్పటికే సివిల్స్‌కు ఎంపికైన వారు మరోసారి అటెంప్ట్‌ చేసే విషయంలో కొత్త పరిమితులు విధించింది. ఐఏఎస్, ఐఎఫ్ఎస్ (ఫారిన్ సర్వీస్), ఐపీఎస్ సర్వీస్‌‌లకు ఎంపికైన వారికి కొత్త ఆంక్షలను విధించింది. ఇప్పటికే సర్వీస్ పొందిన వారు ప్రయోగాత్మకంగా అనవసరపు అటెంప్ట్స్ చేయకుండా చూసే ఉద్దేశంతో కొత్త రూల్స్ తీసుకొచ్చారు. యూపీఎస్సీ ఇప్పటికే కొత్త కేడర్ పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు మార్పుల ఫలితంగా.. ఆలిండియా సర్వీసుల్లో చేరాలనే బలమైన ఆకాంక్ష ఉన్నవారు మాత్రమే ఇక మీదట సివిల్స్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది.


1. ఇప్పటికే ఐఏఎస్ లేదా ఐఎఫ్ఎస్‌కు ఎంపికైన అభ్యర్థులు


2. ఇప్పటికే ఐపీఎస్‌కు ఎంపికైన అభ్యర్థులు


3. సీఎస్ఈ 2026 ద్వారా ఐపీఎస్ లేదా గ్రూప్ ఏ సర్వీస్ పొందే అభ్యర్థులు


4. సీఎస్ఈ 2025 లేదా దానికి ముందే సివిల్ సర్వీసెస్‌‌కు ఎంపికైన వారు


సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2026 నోటిఫికేషన్ కంటే ముందే సివిల్స్‌లో ఉత్తీర్ణులై.. ఐఏఎస్ లేదా ఐఎఫ్ఎస్ సర్వీస్‌కు ఎంపికైన అభ్యర్థులు సీఎస్ఈ 2026 ఎగ్జామ్స్ రాయలేరు. ఈ సర్వీసుల్లో కొనసాగుతూనే మరోసారి సివిల్స్ అటెంప్ట్ చేయడం కుదరదు. ఉద్యోగానికి రాజీనామా చేసి మళ్లీ సివిల్స్ రాయొచ్చు.


ప్రిలిమ్స్ 2026 తర్వాత ఐఏఎస్ లేదా ఐఎఫ్ఎస్ సర్వీస్ పొందిన అభ్యర్థులు సైతం 2026 సివిల్స్ మెయిన్స్ రాయడానికి అర్హతను కోల్పోతారు. మెయిన్స్ 2026 తర్వాత ఐఏఎస్ లేదా ఐఎఫ్ఎస్ సర్వీస్‌ను కేటాయించబడిన అభ్యర్థులను సైతం సీఎస్ఈ 2026 సర్వీస్ కేటాయింపుల విషయంలో పరిగణనలోకి తీసుకోరు. అంటే పాత నియామకమే వర్తిస్తుంది.


ఇప్పటికే ఐపీఎస్ సర్వీస్‌కు ఎంపికైన అభ్యర్థులకు కొంత ఫ్లెక్సిబులిటీని కల్పించారు. ఇలాంటి వారు మళ్లీ సివిల్స్ రాయొచ్చు. కానీ సీఎస్ఈ 2026లో ఐపీఎస్‌ను ఎంపిక చేసుకోలేరు. ఇతర సర్వీసులను మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల ఒకే అభ్యర్థి రెండుసార్లు ఐపీఎస్ సీటును పొందకుండా చూడటానికి వీలవుతుంది.


సీఎస్ఈ 2026 రాసి ఐపీఎస్ లేదా ఇతర గ్రూప్ ఏ సర్వీసులకు ఎంపికైన అభ్యర్థులు సీఎస్ఈ 2027 రాయొచ్చు. అయితే ఆ అభ్యర్థి తప్పనిసరిగా ట్రైనింగ్ అథారిటీ నుంచి మినహాయింపును పొందాలి. ఈ వెసులుబాటు ఒకసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా సదరు క్యాండిడేట్ తప్పనిసరిగా ఫౌండేషన్ కోర్స్ మాత్రమే అటెండ్ అవ్వాలి, ఎగ్జెంప్షన్ వాడితే పూర్తి శిక్షణ సాధ్యపడదు. ఒకవేళ ట్రైనింగ్‌లో చేరకపోయినా లేదా ఎగ్జెంప్షన్ పొందకపోయినా.. సీఎస్ఈ 2026 నియామకం ఆటోమెటిగ్గా రద్దవుతుంది.


సీఎస్ఈ 2026కు ఎంపికైన అభ్యర్థి సీఎస్ఈ 2027 కూడా రాసి అర్హత సాధిస్తే.. అప్పుడు ఆ అభ్యర్థి ముందు రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి 2026 సర్వీస్‌లోనే కొనసాగొచ్చు లేదంటే 2027 సర్వీస్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ రెండింట్లో ఎంపిక చేసుకోని సర్వీస్ క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ క్యాండిడేట్ గనుక సీఎస్ఈ 2027లో సర్వీస్ పొందలేకపోతే.. 2026 సర్వీస్‌లోనే చేరొచ్చు.


సీనియార్టీ అనేది సర్వీస్‌లో చేరిన తేదీని బట్టి ఉంటుంది. కాబట్టి క్యాండిడేట్ మరోసారి ఎగ్జామ్‌ రాసినప్పటికీ సీనియార్టీని తగ్గించరు.


సర్వీస్‌లోనే కొనసాగుతూ.. సీఎస్ఈ 2028 లేదా ఆ తర్వాత నిర్వహించే సివిల్స్ ఎగ్జామ్స్ రాయలేరు. మరోసారి ఎగ్జామ్ రాయాలంటే ప్రస్తుత సర్వీస్‌కు రాజీనామా చేయాలి.


వచ్చిన ర్యాంక్ నచ్చకపోవడంతో.. మళ్లీ సివిల్స్‌కు అటెంప్ట్ చేయాలనుకునే వారు.. సీఎస్ఈ 2026 లేదా 2027లో చేరకుండా ఉండాలి. లేకపోతే కేటాయించిన సర్వీస్ రద్దవుతుంది.


2025లో లేదా అంతకంటే ముందు సివిల్స్ సాధించిన వారికి ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. అటెంప్ట్స్ మిగిలిపోయినా లేదంటే రాయడానికి అర్హత ఉంటే.. వీరు 2026లో లేదా 2027లో సివిల్స్ రాయొచ్చు. సీఎస్ఈ 2028 లేదా ఆ తర్వాత నిర్వహించే సివిల్స్ ఎగ్జామ్స్ రాయాలంటే మాత్రమే కచ్చితంగా ప్రస్తుత సర్వీస్‌కు రాజీనామా చేయాలి.


ఒకే అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ సర్వీసులు హోల్డ్ చేయకుండా చూడటానికి, అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి, టాప్ సర్వీసుల్లో సీట్లు బ్లాక్ కాకుండా చూడటానికి, వేగంగా సర్వీస్‌లో స్థిరత్వం సాధించడం కోసం ఈ రూల్స్ ఉపయోగపడతాయి.

Latest News
Bangladesh's newly elected MPs to take oath on Feb 17 Sun, Feb 15, 2026, 12:05 PM
Devotees throng Shiva temples in Telugu states Sun, Feb 15, 2026, 11:59 AM
Rahul Gandhi, Kharge extend Mahashivratri greetings to countrymen Sun, Feb 15, 2026, 11:54 AM
Six arrested from Kolkata in two different theft cases Sun, Feb 15, 2026, 11:47 AM
India vs Pakistan: Emotions high, skies uncertain in Colombo Sun, Feb 15, 2026, 11:44 AM