|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 07:21 PM
మేఘాలయ బొగ్గు గనుల్లో గురువారం భారీ పేలుడు సంభవించింది. తష్ఖాయ్‌లో బొగ్గు గనిలో ఈ దుర్ఘటనలో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఈ పేలుడు బొగ్గు గని లోపల చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రదేశంలో ఉన్న కార్మికుల్లో చాలా మంది చనిపోయి... భారీగా ప్రాణనష్టం సంభవించింది. మృతుల్లో ఎక్కువ మంది అసోంకి చెందిన కార్మికులే అయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రెస్యూ బృందాలను ఆ ప్రాంతానికి పంపించారు.
గని నుంచి దట్టమైన నట్టి పొగ వెలువడుతుండగా.. ఆ ప్రదేశం చుట్టూ బయట ఉన్న కార్మికులు గుమిగూడి ఉన్నారు. ఆ ప్రదేశంలో కొంతమంది మహిళలు, పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. చనిపోయిన కార్మికులలో ఒకరు కటిగోరాలోని బిహారా గ్రామానికి చెందిన వారని ప్రాథమిక సమాచారం. సహాయక చర్యలు, దర్యాప్తు కొనసాగుతున్నందున మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, అధికారులు పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. భద్రతా లోపాలు, అక్రమ మైనింగ్ కారణమని అనుమానిస్తున్నారు. ఈ ఘటన మేఘాలయ బొగ్గు గనులలోని ప్రమాదకరమైన పని పరిస్థితులపై మరోసారి ఆందోళనలను రేకెత్తించింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
Latest News