|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 03:17 PM
తిరుమల లడ్డూలో రసాయనాలు కలిపారనే ఆరోపణలపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. సీబీఐ చార్జ్‌షీట్‌లో ఈ విషయం ఉందని, ఈ మహాపాపంపై వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది వేంకటేశ్వరస్వామిపై దాడిగా అభివర్ణించిన చంద్రబాబు, దొంగతనం చేసిన వారిని సమర్థించడం సరికాదని, తప్పు చేసిన వారికి దేవుడు శిక్ష విధిస్తాడని హెచ్చరించారు. దేవుడి పవిత్రతను కాపాడగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.వైసీపీ పాలనలో ఐదేళ్లు తిరుమలకు భక్తులు రావాలంటే అనుమానించే పరిస్థితి ఏర్పడిందన్నారు. తనతోనే కాదు.. దేవుడితో సైతం వైసీపీ వాళ్లు పెట్టుకున్నారని తెలిపారు. వైఎస్ జగన్ అన్యమతస్తుడు కావొచ్చు.. కానీ డిక్లరేషన్ ఇచ్చి ఆయన దర్శనం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. శ్రీవారిపై జగన్‌కు నమ్మకం ఉంటే డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. దేవుడి పవిత్రత దెబ్బతీసేందుకే లడ్డూలో రసాయనాలు కలిపారని విమర్శించారు.
Latest News