|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 11:25 AM
ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై గత 40 గంటలుగా కొనసాగిన ట్రాఫిక్ నరకానికి ఎట్టకేలకు తెర. గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో దాదాపు 40 గంటల నుంచి నిలిచిపోయిన ట్రాఫిక్. గ్యాస్ ట్యాంకర్‌ను NDRF బృందాలు సురక్షితంగా తొలగించడంతో పునఃప్రారంభమైన వాహనాల రాకపోకలు.ఈ అకస్మాత్తు ట్రాఫిక్ స్తంభన వల్ల వేలాది మంది ప్రయాణికులు రోడ్డుపైనే చిక్కుకుపోయారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు ఉన్న కుటుంబాలు ఆహారం, కనీస తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాత్రిపూట ప్రయాణించే బస్సుల్లో ఉన్న వారు కనీస మరుగుదొడ్డి సౌకర్యాలు, వైద్య సహాయం అందక గంటల తరబడి నరకయాతన అనుభవించినట్లు ప్రయాణికులు తెలిపారు.ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఎక్స్‌ప్రెస్‌వే కంట్రోల్ రూమ్, హైవే పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్లు స్పందించకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంలో, యు-టర్న్‌ల గురించి మార్గదర్శకత్వం అందించడంలో అధికారులు వైఫల్యం చెందారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా, ట్రాఫిక్ నిలిచిపోయినా టోల్ వసూలు కొనసాగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Latest News