రూ. 10 వేల పొదుపుతో ఒకేసారి రూ. 30 లక్షలు....ఎస్బీఐ స్కీమ్ మ్యాజిక్
 

by Suryaa Desk | Wed, Feb 04, 2026, 11:04 PM

పెట్టుబడులు పెట్టేందుకు చాలా ఆప్షన్లు ఉంటాయి. ఎలాంటి రిస్క్ లేని స్కీమ్స్ విషయానికి వస్తే పోస్టాఫీస్ పథకాలు, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటివి ఉంటాయి. ఇక్కడ నిర్దిష్ట కాలానికి నిర్దిష్ట వడ్డీ రేట్ల ప్రకారం రాబడి వస్తుంది. అయితే రిస్క్ ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటివి దీర్ఘకాలంలో మంచి రాబడి అందిస్తుంటాయని చెప్పొచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో సగటున వార్షిక ప్రాతిపదికన చాలా వరకు 12 శాతం వరకు రాబడి వస్తుంటుందని చెప్పొచ్చు. అంతకంటే ఎక్కువ రిటర్న్స్ అందించే స్కీమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం గత 10 సంవత్సరాల వ్యవధిలో అద్భుత రిటర్న్స్ అందించిన 10 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల గురించి తెలుసుకుందాం. ఇక్కడ సంపద 6-7 రెట్ల మేర పెరిగింది.


లంప్ సమ్ పెట్టుబడులపై రిటర్న్స్ 19.28 శాతం నుంచి 21.34 శాతం CAGR రాబడి ఉండగా.. సిప్ పెట్టుబడులపై చూస్తే ఇదే 10 సంవత్సరాల వ్యవధిలో 17.28 శాతం నుంచి 21.53 శాతం వరకు రాబడి వచ్చింది. ఈ పదేళ్ల కాలంలో స్మాల్ క్యాప్ ఫండ్స్ సగటున 16.5 శాతం CAGR రిటర్న్స్ ఉండగా.. మిడ్ క్యాప్ ఫండ్స్ విషయానికి వస్తే 16.42 శాతం, ఇన్‌ఫ్రా థీమ్డ్ ఫండ్స్ 16.16 శాతం, బ్యాంకింగ్ సెక్టార్‌పై 15.05 శాతం రిటర్న్స్ వచ్చాయి.


వీటిల్లో నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, ఎడెల్‌వీస్ మిడ్ క్యాప్ ఫండ్, ఫ్రాంక్లిన్ బిల్డ్ ఇండియా ఫండ్, ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ మిడ్ క్యాప్ ఫండ్, కోటక్ మిడ్ క్యాప్ ఫండ్, నిప్పన్ ఇండియా గ్రోత్ ఫండ్ మిడ్ క్యాప్, బ్యాంక్ ఆఫ్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్‌ఫ్రా ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ స్మాల్ క్యాప్ ఫండ్, ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ వంటివి ఉన్నాయి. వీటిల్లో చాలా వరకు లక్ష పెట్టుబడిపై పదేళ్లలో రూ. 7 లక్షల వరకు వచ్చాయి.


>> HDFC మిడ్ క్యాప్ స్కీమ్ విషయానికి వస్తే రూ. 1 లక్ష పెట్టుబడిని పదేళ్లలో రూ. 6.05 లక్షలు చేసింది. అదే రూ. 10 వేల సిప్ పెట్టుబడితో చూస్తే రూ. 35.03 లక్షలు వచ్చాయి. హెచ్‌డీఎఫ్‌సీ స్మాల్ క్యాప్ ఫండ్ చూస్తే లక్ష పెట్టుబడిని రూ. 5.90 లక్షలుగా మలచగా.. 10 వేల సిప్‌ను రూ. 32.47 లక్షలు చేసింది. చివరగా ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్- డైరెక్ట్ ప్లాన్ చూస్తే రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టిన వారికి రూ. 5.82 లక్షలు రాగా.. ఇక్కడ 10 వేల సిప్‌ను రూ. 30 లక్షలు చేసింది.


Latest News
Imprisonment of human rights attorney couple represents escalation in suppression of dissent in Pakistan: Report Wed, Feb 11, 2026, 02:00 PM
Dehradun firing: Gas agency operator killed in broad daylight, IG assures strict action Wed, Feb 11, 2026, 01:56 PM
BJP MLAs stall proceedings of J&K Assembly over Omar Abdullah's 'unparliamentary remarks' Wed, Feb 11, 2026, 01:39 PM
Why are restrictions only limited to the bowler?: Ashwin reflects on Usman Tariq's bowling action amid criticism Wed, Feb 11, 2026, 01:33 PM
Air show in Upper Assam likely during PM Modi's February 14 visit: CM Sarma Wed, Feb 11, 2026, 01:30 PM