|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 08:51 PM
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ బలూచిస్థాన్‌లో జరుగుతున్న తిరుగుబాటు దాడులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) తిరుగుబాటుదారుల దగ్గర అమెరికన్ అడ్వాన్స్‌డ్ ఆయుధాలు ఉన్నాయని, అవి పాక్ సైన్యంలో కూడా లేవని ఆయన జాతీయ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.ఆసిఫ్ మాట్లాడుతూ, తిరుగుబాటుదారుల దగ్గర ఒక్కొక్కటి రూ.20 లక్షల విలువైన రైఫిల్స్, 4,000–5,000ల డాలర్ల విలువైన థర్మల్ వెపన్ సైట్స్, నైట్ విజన్ డివైసెస్ ఉన్నాయని వెల్లడించారు.ఇలాంటి రైఫిల్ మన సైన్యంలో లేదు. ఈ అమెరికన్ ఆయుధాలు వారికి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు డబ్బు చెల్లిస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు.బలూచ్ తిరుగుబాటుదారుల నాయకత్వం ఆఫ్ఘనిస్థాన్‌లో ఉందని, అక్కడి నుంచే తిరుగుబాటుదారులకు మద్దతు అందుతోందని ఆసిఫ్ ఆరోపించారు. బలూచిస్థాన్ ప్రావిన్స్ పరిమాణం పెద్దది కావడం, తిరుగుబాటుదారులు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల భద్రతా బలగాలు కష్టపడుతున్నాయని ఆయన ఒప్పుకున్నారు.పాకిస్థానీ పంజాబీలను బీఎల్ఏ టార్గెట్ చేస్తోందని ఆసిఫ్ తెలిపారు.వీరితో చర్చలు జరపలేము. పాక్ సైన్యం పూర్తి స్థాయిలో వారిపై దాడి చేస్తుంది అని హెచ్చరించారు.
Latest News