|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 07:16 PM
చెరకు రసం సహజ చక్కెరల నిధి అయినప్పటికీ,హాట్.. హాట్ సమ్మర్‌లో కూల్ కూల్‌గా చెరకు రసం తాగితే.. హాయిగా ఉంటుంది. చెరకు రసం వేసవి ఎండల తాకిడిని తగ్గించడంలో ఎంతగానో సహకరిస్తుంది. చెరుకు రసం తాగితే ఎండ వేడి ,ఉక్కపోత తగ్గుతుంది. చెరకు రసం అలసట, నిస్సత్తువను తగ్గించి తక్షణ శక్తిని అందిస్తుంది. శరీరాన్ని రీహైడ్రేట్ చేస్తుంది. చెరకులో పిండిపదార్థాలు, ఫైబర్, పొటాషియం, జింక్, ఫాస్ఫరస్, క్యాల్షియం, ఐరన్ లాంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్-ఎ, బి, సి కూడా మెండుగా ఉంటాయి. శరీరంలో ప్రొటీన్ స్థాయులను పెంచుతుంది. అలాగే మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు, బరువు తగ్గాలనుకునేవారు, కాలేయ సమస్యలు, దంత సమస్యలు, జీర్ణ సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. రోడ్డు పక్కన లభించే రసంలో పరిశుభ్రత లోపించడం వల్ల ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి ప్రమాదాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.చెరకు రసం 20 నిమిషాల కంటే ఎక్కువసేపు నిల్వ ఉంచింది తాగితే.. శరీరానికి హాని జరుగుంతుంది. చెరకు రసం నిల్వ ఉంటే.. ఆక్సీకరణ చెందుతుంది. అది తాగితే.. కడుపు నొప్పి, వాంతులు, కళ్లు తిరగడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తాజాగా చేసిన చెరకు రసం తాగడం మంచిది.నిద్రలేమి సమస్య..చెరకు రసంలో పొలికోసనాల్ అధికంగా ఉంటాయి. పొలికోసనాల్ అధికంగా ఉండటం వల్ల నిద్రలేమి సమస్య వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్య ముదిరితే.. మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
Latest News