|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 03:58 PM
వైసీపీ పార్టీ హిందూ ద్రోహి అంటూ జనసేన ఎమ్మెల్సీ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రామతీర్థం ధ్వంసం ఘటన, అంతర్వేది రథం దగ్ధం ఘటన, తిరుమల డిక్లరేషన్ తదితర అంశాలపై ఆయన స్పందిస్తూ వైసీపీపై మండిపడ్డారు. తిరుమలలో వసతి గృహాల ధరలు పెంచి... వేంకటేశ్వర స్వామిని సామాన్య భక్తులకు దూరం చేశారని విమర్శించారు. ఏ మాఫియాను కాపాడటానికి ఇదంతా చేశావు జగన్? అని ప్రశ్నించారు. హిందువులపై కుతంత్రాలు చేయడం తప్ప వైసీపీ నేతలకు మరొకటి లేదని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని నాగబాబు మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని ఆచరించే హిందువుగా తాను గర్వపడుతున్నానని చెప్పారు. వైసీపీ నేతలకు ఇతరుల వ్యక్తిగత జీవితాలపై ఉన్న ఆసక్తి... హిందూ దేవాలయాలపై లేదని విమర్శించారు. సినిమా రివ్యూలపై ఉన్న శ్రద్ధ... భగవంతుడిపై ఎందుకు లేదని ప్రశ్నించారు.
Latest News