|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 03:45 PM
వెనెజువెలా రాజధాని కరాకస్ నగరం నిరసన జ్వాలలతో అట్టుడుకుతోంది. సరిగ్గా నెల రోజుల క్రితం అమెరికా సైన్యం జరిపిన మెరుపు దాడిలో బందీలుగా చిక్కిన తమ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌లను వెంటనే విడుదల చేయాలంటూ వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. జనవరి 3న మొదలైన ఈ నిరసనలు మంగళవారం నాటికి ఉద్ధృత రూపం దాల్చాయి.ఒక దేశాధ్యక్షుడిని మరో దేశ సైన్యం బలవంతంగా ఎత్తుకుపోవడాన్ని వెనెజువెలా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పాడ్రినో లోపెజ్ తీవ్రంగా ఖండించారు. "ప్రపంచంలోని అతిపెద్ద అణుశక్తి దేశం, ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా మాపై దాడికి తెగబడింది. ఇది అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధం" అని ఆయన ధ్వజమెత్తారు. వెనెజువెలా సాయుధ దళాలు రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాయని, మదురో తిరిగి వచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Latest News