పాకిస్థాన్ వివాదంపై స్పందించిన రవిచంద్రన్ అశ్విన్
 

by Suryaa Desk | Wed, Feb 04, 2026, 03:42 PM

భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగితే చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. టీ20 ప్రపంచకప్ 2026 ముంగిట పాకిస్థాన్ వివాదం వేళ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్, పాకిస్థాన్ మధ్య వంద శాతం మ్యాచ్ జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. నాలుగైదు రోజుల్లో దాయాది దేశం దారికి వస్తుందని అభిప్రాయపడ్డాడు.వంద శాతం ఇరుదేశాల మధ్య మ్యాచ్ జరుగుతుందని ఆయన అన్నాడు. ఒకవేళ పాకిస్థాన్, భారత్ మధ్య మ్యాచ్ జరగకుంటే ఆ దేశం భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. బ్రాడ్‌కాస్టర్లు కూడా పెద్ద మొత్తంలో నష్టపోతారని, ఆ ప్రభావం అన్ని దేశాల క్రికెట్ బోర్డులపై పడుతుందని అన్నాడు. ఐసీసీ సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వస్తుందని పేర్కొన్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) కోసం విదేశీ ఆటగాళ్లకు ఎన్ఓసీలు రావని చెప్పాడు.భారత్, పాకిస్థాన్ ఇప్పటికే తటస్థ వేదికల్లో పోటీ పడుతున్నాయని, కాబట్టి ఇక్కడ ఇరుదేశాల మధ్య మ్యాచ్‌లకు వేదిక అనేది కారణం కాదని పేర్కొన్నాడు. ఒక ప్రత్యర్థితో ఆడనని చెప్పడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నాడు. పాకిస్థాన్‌కు ఆ దేశమే శత్రువని, ఇందుకు వారి మైండ్ సెట్ కారణమని అన్నాడు. కాగా, ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచ కప్ 2026 భారత్, శ్రీలంక వేదికగా జరగనుంది. 

Latest News
Pakistan govt’s debt burden soars to 70.7 per cent of GDP Fri, Feb 06, 2026, 04:04 PM
White House touts crime drop, border clampdown Fri, Feb 06, 2026, 03:25 PM
Search and rescue operation underway as tiger prowls near Rajahmundry in Andhra Pradesh Fri, Feb 06, 2026, 03:22 PM
History beckons as India chase historic firsts at ICC Men’s T20 WC Fri, Feb 06, 2026, 02:45 PM
T20 WC: India's all-round depth and pace attack in prime shape, says Mhambrey Fri, Feb 06, 2026, 12:54 PM