|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 11:47 AM
ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడితోనే మోడీ సంతకం చేశారని, ప్రధాని దేశాన్ని అమ్మేశారని రాహుల్ ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా చైనా, మాజీ ఆర్మీ చీఫ్ నరవణే పుస్తకం అంశాలను లేవనెత్తగా, నిబంధనల ఉల్లంఘన పేరుతో స్పీకర్ ఆయనను మాట్లాడనివ్వలేదని, చరిత్రలో మొదటిసారి ప్రతిపక్ష నేతను మాట్లాడనివ్వడం లేదని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Latest News