|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 04:53 PM
ఇటీవల కాలంలో హానీట్రాప్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ మోసాలకు గురైన బాధితులు పరువుపోతుందన్న భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకడుగు వేస్తుంటారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో హనీట్రాప్ మోసానికి పాల్పడిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. తంగెళ్లబీడుకు చెందిన కనపర్తి రేణుక అనే మహిళ యువతులను ఆకర్షించేలా అమ్మాయిల ఫొటోలు చూపిస్తూ వ్యక్తులను మాయలో పడేసి డబ్బులు దోచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో మాధవరావు అనే వ్యక్తిని పిలిపించి అతని వద్ద నుంచి ఉంగరం, రూ.5 వేల నగదును కాజేసింది. అనంతరం అత్యాచారం కేసు పెడతానని బెదిరిస్తూ మరో రూ.2 లక్షలు డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు తిరువూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, రేణుకతో పాటు ఆమెకు సహకరించిన మరో వ్యక్తిని అరెస్టు చేశారు.
Latest News