|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 04:39 PM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరగనున్న వేళ, రాష్ట్ర బీజేపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై తన ఎన్నికల సంబంధిత బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించారు. కుటుంబపరమైన అత్యవసర కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. తమిళనాడులో ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఎన్నికల వ్యూహరచనలో నిమగ్నమైన కీలక తరుణంలో అన్నామలై ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. సింగనల్లూర్, విరుగంబాక్కం సహా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలను బీజేపీ అధిష్ఠానం ఆయనకు అప్పగించింది. తన తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో ఆయనకు సేవ చేసేందుకే క్రియాశీలక ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు అన్నామలై వివరించారు. ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని, రాజకీయపరమైనది కాదని స్పష్టం చేశారు. బీజేపీ, ఎన్డీయే సిద్ధాంతాలకు తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని పునరుద్ఘాటించారు.
Latest News