|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 02:46 PM
ప్రతి సంవత్సరం మాఘ మాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రోజున మహా శివరాత్రి జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 15 ఆదివారం నాడు పండుగ జరుపుకోగా, ఫిబ్రవరి 17న సూర్య గ్రహణం ఏర్పడనుంది. శివరాత్రి తర్వాత సూర్య గ్రహణం రావడం వలన సింహ, వృశ్చిక, కుంభ, తుల రాశుల వారు ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు వంటి అనేక సమస్యలను ఎదుర్కోనున్నారని తెలుస్తోంది. సింహ రాశి వారు ఆర్థిక విషయాల్లో, వైవాహిక జీవితంలో జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి వారు మోసపోయే అవకాశం ఉంది. కుంభ రాశి వారికి ఆర్థిక సమస్యలు, ఆత్మవిశ్వాసం లోపించడం వంటివి ఎదురవుతాయి. తుల రాశి వారికి ప్రయాణంలో, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.
Latest News