|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 02:17 PM
హై బీపీ వల్ల గుండె, మెదడు, కిడ్నీలు, కళ్ళు వంటి అవయవాలు దెబ్బతింటాయని వైద్యులు హెచ్చరించారు. బీపీ పెరిగినప్పుడు కళ్ళు తిరగడం, తూలడం, బ్యాలెన్స్ తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని సూచించారు. సొంత వైద్యం చేసుకుంటే ప్రాణాపాయం అని, ఇటీవల ఒక రోగి బీపీ మాత్రలు సొంతంగా వేసుకోవడంతో కోమాలోకి వెళ్లిపోయారని వివరించారు. స్కాన్‌లో బ్రెయిన్ స్టెమ్‌కు రక్త సరఫరా ఆగిపోయినట్లు తేలిందని, దీనివల్ల శ్వాస, గుండె స్పందన వంటి కీలకమైన విధులు నిలిచిపోయాయని వివరించారు.
Latest News