|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 07:57 PM
చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. ముఖ్యమంత్రిని, ఆయన తల్లిని కించపరిచేలా అంబటి చేసిన వ్యాఖ్యలను సభ్య సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించదని ఆమె స్పష్టం చేశారు.అంబటి రాంబాబు గారు వాడిన భాష సభ్య సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించదు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా దూషించడం, అంతేకాకుండా వారి తల్లిని అవమానించడం అత్యంత ఖండనీయమైన చర్య. రాజకీయాలలో వాదనలు, విమర్శలు సహజం. కానీ అవి వ్యక్తిగత దూషణల స్థాయికి దిగజారకూడదు. ప్రజలు నాయకుల నుంచి విలువలతో కూడిన రాజకీయాలను ఆశిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో అసహనం పెంచుతాయి. అందువల్ల బాధ్యత గల నాయకులు తమ మాటల్లో సంయమనం పాటించి, గౌరవప్రదమైన రాజకీయ సంస్కృతిని కాపాడాలి అని పురందేశ్వరి హితవు పలికారు.
Latest News