|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 07:34 PM
లండన్ నుంచి బెంగళూరు వస్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానానికి సాంకేతిక లోపం కారణంగా పెను ప్రమాదం తప్పింది. ఇంజన్ స్టార్ట్ చేసే సమయంలో ఇంధన స్విచ్ 'రన్' పొజిషన్‌లో నిలవకుండా 'కట్ ఆఫ్'కి మారడంతో విమానాన్ని గ్రౌండ్ చేశారు. ఈ సమస్యపై డీజీసీఏ దృష్టి సారించింది. జూలై 2025లో అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ ప్రమాదం తర్వాత ప్రాథమిక నివేదికలో టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాల్లో ఇంజన్ల ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు తాత్కాలికంగా ఆఫ్ చేయబడినట్లు, దీంతోనే ఇంజన్లకు అందాల్సిన శక్తి తగ్గిందని వెల్లడైంది. ఫలితంగా టేకాఫ్ అయిన క్షణాల్లోనే విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 260 మంది మరణించారు.ఇంధన నియంత్రన స్విచ్‌లు విమాన ఇంజన్లకు ఇంధన సరఫరాను నియంత్రిస్తాయి. సాధారణంగా విమానం నేలపై ఉన్నప్పుడు ఇంజన్ స్టార్ట్ లేదా షట్‌డౌన్ చేయడానికి పనిచేస్తాయి. విమానంలో ఇంజన్ లోపం తలెత్తినప్పుడు మాన్యువల్‌గా ఆపడానికి లేదా మళ్లీ స్టార్ట్ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు.బోయింగ్ 787లోని రెండు ఫ్యూయల్ స్విచ్‌లు థ్రస్ట్ లివర్ కింద ఉంటాయి. రన్ నుంచి కట్ ఆఫ్‌కు మార్చాలంటే పైలట్ ముందుగా స్విచ్‌ను పైకి లాగి, ఆ తర్వాత దాని స్థానాన్ని మార్చాలి. అహ్మదాబాద్ ప్రమాదంలో టేకాఫ్ అయిన వెంటనే ఇంజన్ స్విచ్‌లు ఒక సెకన్ వ్యవధిలో వరసగా రన్ నుంచి కట్ఆఫ్‌గా మారినట్లు ఫ్లైట్ రికార్డర్ వెల్లడించింది. కాక్‌పిట్‌లో ఒక పైలట్ ‘‘నువ్వు ప్యూయల్ ఎందుకు కట్ చేశావు..?’’ అని అడగగా, మరొకరు ‘‘నేను చేయలేదు’’ అని సమాధానం ఇచ్చారు.
Latest News