|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 07:01 PM
పంచదారను కొన్ని రోజులు మానేయడం వల్ల చర్మ ఆరోగ్యంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 3 రోజుల్లోనే మొటిమల ఇరిటేషన్, ఎరుపుదనం తగ్గగా, అండర్‌ఐ పఫీనెస్ తగ్గుతుంది. అదే విధంగా, పంచదారని మానేస్తే ఉదయం లేవగానే ముఖం వాచినట్లుగా కనిపించేవారికి , అండర్ ఐ పఫీనెస్ ప్రాబ్లమ్ తగ్గుతుంది. కొంతమంది ఉదయం లేవగానే ముఖం, కళ్ళు ఉబ్బినట్లుగా ఉంటుంది. అలాంటివారు దానిని తగ్గించుకునేందుకు ఐస్ వాటర్ వాడడం, మసాజ్ చేయడం వంటివి చేస్తారు. అలా కాకుండా పంచదారని మానేసి చూడండి ఫేషియల్, ఐ పఫీనెస్ తగ్గుతుంది.ఇక వరుసగా పంచదారని 11 నుంచి 14 రోజుల పాటు మానేస్తే ఎవరైతే ముఖంలో నీరు నిలిచి ముఖమంతా లావుగా ఉన్నట్లుగా అనిపిస్తుందో వారికి నీరంతా పోయి చక్కగా ఉంటుంది. ఫేస్ కూడా చక్కగా డిఫైండ్ అంటే సన్నగా చిన్నవారిలా కనిపిస్తుంది. ముఖం చాలా లావుగా ఉన్నట్లు కనిపించేవారికి ఎలాంటి మందులు వాడకుండానే ఇదో వరంలా ఉంటుంది.గట్ ప్రాబ్లమ్స్‌తో ఎక్కువగా బాధపడేవారికి ఇదో బెస్ట్ ఆప్షన్. పంచదారని మానేస్తే గట్ హెల్త్ బాగుంటుంది. జీర్ణ సమస్యలు చాలా వరకూ తగ్గుతాయి. బ్లోటింగ్ తగ్గుతుంది. వీటితో పాటు కొత్తగా వచ్చే మొటిమలు, ఆయిలీనెస్ కూడా తగ్గుతుంది. కాబట్టి, హ్యాపీగా పంచదారని మానేయండి.
Latest News