|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 06:10 PM
ఈ మధ్య బంగారం, వెండి ధరల పెరుగుతూనే ఉన్నాయి. కానీ ధనియాల గురించి తెలిస్తే షాక్ అవుతారు. ఫిబ్రవరి 2న నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (NCDEX)లో ధనియా ధర క్వింటాలుకు రూ.12,054కు చేరి ఆల్‌టైమ్ హై నమోదు చేసింది. 52 వారాల కనిష్ట ధర రూ.6,780తో పోలిస్తే ఏడాదిలో రూ.5,274 పెరుగుదల కనిపించింది. గత నెలలో కొత్తిమీర ధరలు దాదాపు 10% పెరిగాయి. గత ఏడాదిలో ధనియాల ధరలు 43 శాతం పెరిగాయి. సాగు విస్తీర్ణం తగ్గడం, వాతావరణ ప్రతికూలతలు ధరల పెరుగుదలకు కారణాలని నిపుణులు చెబుతున్నారు.
Latest News