|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 03:21 PM
2026 టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామన్న పాకిస్థాన్ ప్రభుత్వ నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ నిప్పులు చెరిగారు. ఇలాంటి 'బ్లాక్ మెయిలింగ్' రాజకీయాలను ఐసీసీ ఏమాత్రం సహించకూడదని ఆయన స్పష్టం చేశారు."టోర్నీకి కొన్ని రోజుల ముందు లేదా టోర్నీ మధ్యలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. పాక్ వైఖరిని ఐసీసీ తీవ్రంగా పరిగణించాలి. భవిష్యత్తులో ఏ దేశం కూడా ఇలాంటి సాహసం చేయకుండా ఉండేలా పాకిస్థాన్‌పై కఠినమైన ఆంక్షలు విధించాలి" అని గవాస్కర్ పేర్కొన్నారు. కేవలం పాయింట్లు కోత విధించడమే కాకుండా, ఆర్థికపరమైన జరిమానాలు కూడా వేయాలని ఆయన సూచించారు.పాక్ ఒకవేళ తన నిర్ణయానికి కట్టుబడి ఉంటే.. ఐసీసీ నుంచి వచ్చే వార్షిక ఆదాయాన్ని నిలిపివేయడంతో పాటు, భవిష్యత్తులో పాకిస్థాన్ నిర్వహించాల్సిన ఐసీసీ టోర్నీల హోస్టింగ్ హక్కులను కూడా వెనక్కి తీసుకోవాలని గవాస్కర్ డిమాండ్ చేశారు.
Latest News