|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 03:18 PM
తిరుమలలో భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు టీటీడీ కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను (ఎఫ్‌ఆర్‌సీ) ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసింది. గత నెలలో రథసప్తమి సందర్భంగా మాడవీధుల్లో వీటిని ప్రయోగాత్మకంగా వినియోగించారు. ఈ కెమెరాల ద్వారా భక్తుల రద్దీని అంచనా వేయడంతో పాటు భద్రతాపరమైన అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ఈ కెమెరాలను అనుసంధానించారు. ఈ టెక్నాలజీ సాయంతోనే డిసెంబర్, జనవరి నెలల్లో వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో రికార్డుస్థాయి భక్తుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించినట్లు అధికారులు తెలిపారు.
Latest News