శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం.. ఈవోగా ముద్దాడ రవిచంద్ర నియామకం
 

by Suryaa Desk | Sun, Feb 01, 2026, 04:00 PM

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో సిట్ విచారణ కీలక మలుపు తిరిగింది. గతంలో టీటీడీ ఈవోగా పనిచేసిన అనిల్ సింఘాల్ నెయ్యి కొనుగోలు నిబంధనల్లో సడలింపులు ఇచ్చినట్లు సిట్ గుర్తించింది. దీనిపై అనిల్ సింఘాల్‌పై చర్యలు తీసుకోవాలని సిట్ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో, అనిల్ సింఘాల్‌ను బదిలీ చేసి, ముద్దాడ రవిచంద్రను నూతన ఈవోగా ప్రభుత్వం నియమించింది. రవిచంద్ర బాధ్యతలు స్వీకరించే వరకు వెంకయ్య చౌదరి ఇంచార్జ్ ఈవోగా కొనసాగుతారు.అయితే సిట్ సభ్యులపై వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీకోర్టును ఆశ్రయించడంతో సీబీఐ నేతృత్వంలోని సిట్‌ను నియిమించాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీబీఐ ఆధ్వర్యంలో నియామకమైన సిట్ సభ్యులు పలు కోణాల్లో విచారణ జరిపారు. విచారణ పూర్తి కావడంతో కోర్టుకు నివేదిక అందించారు. తిరుమల లడ్డూలో జంతువుల అవశేషాలు కలవలేదని, కానీ కల్తి జరిగినట్లు నివేదికలోపేర్కొన్నారు. 

Latest News
LS adjourned till noon amid constant sloganeering from Oppn MPs Wed, Feb 04, 2026, 11:18 AM
CM Mamata Banerjee reaches SC for Bengal SIR hearing Wed, Feb 04, 2026, 10:52 AM
Dense fog grips Delhi; low visibility procedures in place at IGI Airport Wed, Feb 04, 2026, 10:43 AM
FC Barcelona ease past Albacete to reach Copa del Rey SF Wed, Feb 04, 2026, 10:40 AM
Too early to judge India-US trade deal, assessment only after implementation: Mayawati Tue, Feb 03, 2026, 04:22 PM