01.02.2026 నుండీ 07.02.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
 

by Suryaa Desk | Sun, Feb 01, 2026, 11:36 AM

మేషరాశి.... (అశ్విని 1 2 3 4,భరణి 1 2 3 4,కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ,  లూ, లే, లో,ఆ)ప్రారంభంలో గృహ వాహన  అంశముల మీద దృష్టి సాధిస్తారు. తల్లి ఆరోగ్యం వృద్ధి. విద్యా విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన అంశాలు నేర్చుకుంటారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు, ఆలోచనలు ఆనందాన్ని కలిగిస్తాయి. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. నైపుణ్యాలు పెంపొందించుకుంటారు. ఎదురుచూస్తున్న విషయాలలో ఆశించిన ఫలితాలు మానసిక ప్రశాంతను పెంపొందిస్తాయి. వారాంతంలో పోటీ విషయాలను అనుకూలంగా ఉంటాయి. ప్రత్యర్థుల మీద విజయం, అనుకూల ఆరోగ్యం, రుణాలను చెల్లించ గలుగుతారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలం. కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ప్రదేశాలకు వెళ్లడానికి ప్రణాళికలు. స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటారు గౌరవం గుర్తింపు కీర్తి పెరుగుతాయి. శివారాధన మేలు.


వృషభరాశి...(కృతిక 2,3,4,రోహిణి 1 2 3 4,మృగశిర 1 2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)  ఆత్మీయులైన మిత్రులతో కలిసి నూతన ఆలోచనలు. దగ్గర ప్రయాణాలు. పనికి తగిన ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. తండ్రి, పెద్దల యొక్క  సహకారం అందుకుంటారు. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, వ్యక్తిగత శ్రద్ధ, దినచర్యలలో మార్పు అనుకూలంగా ఉంటాయి. విదేశీ అవకాశాల కొరకు ప్రయత్నాలు అధికం. ఆధ్యాత్మిక ఆలోచనలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ వాతావరణం కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. విద్యలో ఆటంకాల్ని అధిగమించే దిశగా ప్రయత్నాలు చేయాలి. వారాంతంలో కమ్యూనికేషన్ అనుకూలం. వృత్తిలో  నూతన అవకాశాలు, బాధ్యతలు. దూర ప్రదేశాలలో ఇంటర్వ్యూలు. రోగ నిరోధక శక్తిని పెంపొందించు కోవడానికి చేసే  ప్రయత్నాలు, అనుకూలంగా ఉంటాయి. ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు. వృత్తి చేసే ప్రదేశాలలో అధికారులతో సమస్యల్ని వినయంగా సమన్వయ పరచుకుంటూ సాధించుకోవాలి. ఇష్టదేవత ప్రార్థన మేలు చేస్తుంది.


మిధున రాశి...(మృగశిర 3 4,ఆరుద్ర 1 2 3 4,పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)  ప్రారంభంలో కొంతవరకు ఆర్థిక విషయాలు, కుటుంబ సభ్యుల తో వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ, మిత్రులు, ఆత్మీయుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లభించుటలేదని భావన ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహాయంతో చేద్దామనుకుంటున్న కార్యక్రమాలు చిన్నపాటి ఆటంకాలు. కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. సంతాన ఆరోగ్య శ్రద్ధ తీసుకుంటారు. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించవలసిన పరిస్థితి. దగ్గర ప్రయాణాలకు అవకాశం. ప్రయాణాలలో  నూతన వ్యక్తుల పరిచయాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలి. వారాంతంలో గృహ విషయాలు మీద శ్రద్ధ అధికం చేస్తారు. ఖర్చులు అధికంగా. పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ. సంతానం అభివృద్ధి. దత్తాత్రేయ ఆరాధన మేలు.


కర్కాటక రాశి...(పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4 పాదాలు) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)ప్రారంభంలో ఆరోగ్యము అనుకూలంగా ఉంటుంది నూతన ఆలోచనలు. వృత్తిపరమైన అభివృద్ధి, సంతానము  విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, నూతన వ్యక్తుల పరిచయం సంఘంలో గుర్తింపు గౌరవం సామాన్యం. మాటల వల్ల కుటుంబ సభ్యులతో ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలి. ఆర్థిక విషయాల్లో అనుకూలత మిశ్రమం. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలకు అవకాశం, ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించే పరిస్థితులు. గృహంలో పుణ్యప్రదమైన దైవిక కార్యక్రమాలు. వారాంతంలో కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది, కుటుంబంలో ఖర్చులు అధికమైనప్పటికీ గృహ వాహన  విషయాలు అనుకూలిస్తాయి. విద్యా విషయాలలో ఆశించిన ఫలితాలు. ఉన్నత స్థాయి వ్యక్తులకు సహకారం ఆనందాన్నిస్తుంది. మంచి గురువులభ్యం. రీసెర్చ్ ఓరియంటెడ్ విద్యలలో ప్రవేశాలకి అవకాశం. అమ్మవారి ఆరాధన మేలు.


సింహరాశి...(మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1వ పాదం)  (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)వారం ప్రారంభంలో నిద్రలేమి అలసట పని ఒత్తిడి అధికముగా ఉంటాయి. సమయానికి ఆహార స్వీకరణ అవసరం. అనవసరమైన ఖర్చులను అధిగమించాలి. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. రోగ నిరోధక శక్తి అనుకూలం,ఆశించిన వ్యక్తుల యొక్క సహకారం ఆనందాన్నిస్తుంది. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. మాటలు వల్ల అపార్ధాలు ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా, వాగ్దానాల విషయంలో, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, ఆర్థిక సంబంధ అంశాలలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలి. ముఖ్యమైన విషయాలలో ఆలస్యాలు చికాకును కలిగిస్తాయి. సాంఘిక సంబంధాల్లో తగు జాగ్రత్తలతో శ్రద్ధ తీసుకోవాలి.


వారాంతంలో శక్తి సామర్థ్యాలు ఉపయోగించి అనుకున్న పనిని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. తోబుట్టులతో ఘర్షణలకు దూరం అవసరం. సుబ్రమణ్యేశ్వర స్వామి ఆరాధన మేలు చేస్తుంది.


కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4,హస్త 4,చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో,పా,పి,పూ,షం,ణా,పే,పో)


ప్రారంభంలో ఆర్థిక విషయాలలో అనుకూలం, ఎదురుచూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. తోబుట్టువులతో అభిప్రాయ బేధాలు అధిగమిస్తారు.  పెట్టుబడుల కొరకు ప్రయత్నాలు. ఆత్మీయులను సంప్రదించి ముందుకు వెళ్లడం మేలు. భాగస్వామ్య వ్యవహారాలలో ఆచితూచి నిర్ణయాలు అవసరం. దీర్ఘకాలికి పెట్టుబడులు ఆలోచనలు.దూర ప్రయాణాలు, నిద్రలేమి, అనవసర ఖర్చులు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో చర్చలు నిదానం అవసరం. గవర్నమెంట్ పనులు  అధిక శ్రమతో ముందుకు వెళతాయి. సంతానం అభివృద్ధి కొరకు, వారి విద్యా నిమిత్తం కొత్త ఆలోచనలు చేస్తారు. వారాంతంలో కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది, వృత్తిలో అభివృద్ధి. శ్రమకి తగిన గుర్తింపు గౌరవం, పోటీలలో నెగ్గుతారు, నూతన అవకాశాలు. విష్ణుమూర్తి ఆరాధన మేలు.


తులా రాశి...(చిత్త 3 4,స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)    


వృత్తిపరైన విషయాలలో అధిక శ్రమతో, గుర్తింపు గౌరవం కోసం ముందుకు వెళతారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం సామాన్యం. విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో శ్రద్ధ అవసరం. గృహ వాతావరణం మీద ప్రత్యేక శ్రద్ధ. ఆర్థిక విషయాలలో అభివృద్ధి, దూర దేశాల నుంచి వర్తమానాలు, సంతాన విషయంలో కీలక నిర్ణయాలు. వ్యాపార విషయాలలో కొత్త మార్పులలో తొందరపడి నిర్ణయాలు పనికిరావు. కంటి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దీర్ఘకాలికి పెట్టుబడుల విషయంలో నూతన వ్యక్తుల పరిచయం. వారాంతంలో సంతానం, వారి అభివృద్ధి కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు. ప్రయాణాలకు అవకాశం అధికం. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో, షాపింగ్ లో పాల్గొంటారు. సూర్యనారాయణ స్వామి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది.


వృశ్చిక రాశి...(విశాఖ 4,అనురాధ 1 2 3 4, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)   ప్రారంభంలో ఆధ్యాత్మిక ఆలోచనలు అధికంగా ఉంటాయి తండ్రి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది శ్రమకి తగిన గుర్తింపు గౌరవం లభిస్తుంది, ఆధ్యాత్మిక ప్రయాణాలకు అవకాశం. క్రింద సిబ్బంది సహకారంతో అనుకున్న సమయంలో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తిపరమైన విషయాలలో వ్యక్తుల సహకారం ధైర్యాన్ని నమ్మకాన్ని పెంపొందిస్తుంది. ఎదురుచూస్తున్న విషయాలలో ఒక వార్త ఆనందాన్నిస్తుంది. స్నేహితులతో చర్చలు నూతన నిర్ణయాలు, వారసత్వపు ఆస్తులు విషయంలో మార్పులు, వారాంతంలో శ్రమ అధికంగా ఉంటుంది, స్థిరాస్తులు విషయంలో నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వాహనాలు, గృహ సంబంధ మార్పులు ప్రశాంతతను ఇస్తాయి. డ్రైవింగ్ చేసేవారు తగిన జాగ్రత్తలతో ఉండాలి. మరిన్ని మంచి ఫలితాలు కొరకు శ్రీకృష్ణ మందిరాలు దర్శించడం మేలు.


ధను రాశి...(మూల 1 2 3 4,పూర్వాషాఢ 1 2 3 4,ఉత్తరాషాఢ 1వ  పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)వారం ప్రారంభంలో ఆర్థిక కుటుంబ వ్యవహారాలలో ఆకస్మిక ఖర్చులు. వాగ్వాదాలకి దూరంగా ఉండాలి. సంతానంతో చర్చించేటప్పుడు వారి అభివృద్ధి విషయంలో, స్నేహ సంబంధాల విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. దూర ప్రయాణాలకు అవకాశం. ఉన్నత విద్య కొరకు రుణ ప్రయత్నాలు. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ. వృత్తి విషయాలలో ఇతరుల జోక్యం ప్రశాంతతను తగ్గిస్తుంది. గృహ నిర్మాణ అంశాలలో ఆలస్యాలు ఉన్నప్పటికీ కొంతమేర ముందుకు వెళతారు. వారాంతంలో వృత్తి, భాగస్వామ్య వ్యవహారాలలో కమ్యూనికేషన్ విషయంలో నిదానం అవసరం. ఎదురుచూస్తున్న వర్తమానాలు ఆనందాన్ని కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో, చర్చలు, సమావేశాలు. ఆర్థిక విషయాలు అనుకూలం. హనుమాన్ మందిరాలు దర్శనం మేలు.


మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ఠ 1 2  పాదాలు) (నామ నక్షత్రములు: భ,జా,జి,ఖి,ఖు,ఖే,ఖో,గా,గి)


ప్రారంభంలో గౌరవం, గుర్తింపు. నూతన స్నేహ సంబంధాలలో, భాగస్వామ్య వ్యవహారాలు, నిర్ణయాలు శ్రమతో ఉంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. దూర ప్రదేశాలలో స్థిరాస్తులు అంశంలో పెట్టుబడుల కొరకు కుటుంబ సభ్యులతో చర్చలు. వ్యాపార విషయంలో మిశ్రమం. ఉన్నత స్థాయి వ్యక్తులతో సహకారం కొరకు ప్రయత్నించేటప్పుడు జాగ్రత్తలు అవసరం, అభిప్రాయ బేధాలకు దూరంగా ఉండాలి. మానసిక ప్రశాంతత విషయంలో మెడిటేషన్ మంచిది. వాహనము నడప వారు తగిన జాగ్రత్తలు అవసరం. శ్రమకి తగిన ఫలితం విషయంలో మిశ్రమ ఫలితాలు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం, ఉన్నత విద్య విషయంలో సామాన్యం. వారాంతంలో వృత్తిపరంగా అభివృద్ధి నూతన అవకాశాలు. ఆలోచనలు ఫలిస్తాయి. అమ్మవారి ఆరాధన మేలు


కుంభ రాశి...(ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూర్వాభాద్ర 1 2 3  పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)    ప్రారంభంలో శ్రమతో, అధిక కృషితో వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ప్రయత్నాలు, ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు. వృత్తి చేసే ప్రదేశాలలో కొలీగ్స్ తో, అధికారులతో ఘర్షణలకు దూరంగా ఉండడం మేలు. అసంతృప్తిని అధిగమించాలి. భాగస్వామ్య వ్యవహారాలలో, స్నేహ సంబంధాలను నిలబెట్టుకునే అంశాల్లో అధిక ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాలని కొంతవరకు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్లాలి. జీవిత భాగస్వామికి సహకరించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆర్థిక విషయాలలో, వాగ్దానాలలో నిలబెట్టుకొనుటకు ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు ఆటంకాలు ప్రశాంతతను తగ్గిస్తాయి. వారాంతంలో తల్లిదండ్రుల సహకారం అనుకూలంగా ఉంటుంది, ఉన్నత విద్య, మానసిక తృప్తి. వాహన సౌఖ్యం. నిద్రలేమిని అధిగమించాలి. వెంకటేశ్వర స్వామి ఆరాధన మేలు.


మీన రాశి...(పూర్వాభాద్ర 4,ఉత్తరాభాద్ర 1 2 3 4,రేవతి 1 2 3 4 పాదాలు)(నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)


ప్రారంభంలో ఆర్థిక నిర్ణయాలు, సంతానవర్గంతో అనుకూల వాతావరణం. ఆశించిన విషయాలను ఫలిస్తాయి. మానసిక ప్రశాంతత. ఉన్నత స్థాయి వ్యక్తులు, తండ్రి గారి సహకారం, ఉన్నత విద్యల అభివృద్ధి, దూర ప్రదేశాల్లో ఉండే ఆత్మీయ వ్యక్తుల ఆహ్వానాలు. ఆరోగ్యం అనుకూలం, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటారు. రుణాలను తీర్చి వేస్తారు. సాంఘిక సంబంధాలు, గుర్తింపు గౌరవం పెరుగుతుంది. ప్రయాణాలకు అవకాశం. వారాంతంలో వ్యాపార భాగస్వామ్య విషయాలలో, ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. కమ్యూనికేషన్ విషయంలో ఆలోచించి మాట్లాడాలి. తల్లి, తోబుట్టువులతో చర్చించేటప్పుడు, భూ సంబంధ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముఖ్య విషయాలలో నిదానమవసరం. విదేశీ అవకాశాలు. అలవాట్లను నియంత్రించుకోవాలి. ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవాలి. మంచి ఫలితాల కొరకు హనుమాన్ చాలీసా మేలు.


(గమనిక: గోచార రీత్యా చెప్తున్న రాశి ఫలితాలు జనరల్ వి, వ్యక్తిగతంగా ఉద్దేశించి చెబుతున్నవి కావు, వ్యక్తిగత జన్మజాతకంలో అనగా వ్యక్తి జన్మ కుండలి (జన్మించిన సమయం, తేదీ, ప్రదేశం ఆధారంగా నిర్మించేది) ప్రకారం నడిచే దశలు అంతర్దశలు ప్రధానంగా చూసుకుంటూ ఆ దశ అంతర్దశలకు సంబంధించిన దానికి తగిన పరిహారాలు పాటించుకుంటూ, దానితో పాటు ఈ గోచార ఫలితాలను చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే  రాశి   ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు).


డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani


జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant
email : padma.suryapaper@gmail.com
www.padmamukhi.com 

Latest News
Arsenal reach Carabao Cup final after last-gasp Havertz goal Wed, Feb 04, 2026, 12:53 PM
US Senators accuse UBS of blocking Holocaust truth Wed, Feb 04, 2026, 12:48 PM
CM Mamata files fresh plea in SC to stop voter name deletions during SIR in Bengal Wed, Feb 04, 2026, 12:37 PM
TN records over one lakh new cancer cases in 2025; Chennai reports highest count Wed, Feb 04, 2026, 12:28 PM
Trump calls for federal role in US elections Wed, Feb 04, 2026, 12:23 PM