అంబటి రాంబాబుకు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ తీవ్ర హెచ్చరిక
 

by Suryaa Desk | Sun, Feb 01, 2026, 11:25 AM

అంబటి రాంబాబు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, బహిరంగ క్షమాపణ చెప్పాలి.అంబటి రాంబాబు గారు ఇటీవల హద్దులు దాటి, సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడుతున్న తీరు తీవ్రంగా ఖండిస్తున్నానని గౌరవ శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు మండిపడ్డారు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన భాష ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. ఇటువంటి అసభ్య, దిగజారిన వ్యాఖ్యలు సమాజాన్ని తీవ్రంగా కలచివేస్తున్నాయని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ సంస్కృతి పతనానికి నిదర్శనమని విమర్శించారు. వ్యక్తిగత దూషణలు, బూతు రాజకీయాలు చేయడం క్షమించరాని నేరమని, ఇవి ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేశారు.సభ్య సమాజంలో జీవిస్తున్నామనే కనీస అవగాహన కూడా లేకుండా, పదే పదే దిగజారిన రాజకీయ భాషను ఉపయోగించడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను సభ్య సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు భవిష్యత్తులో ఎవరు కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేయకుండా తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.తన ఉనికిని చాటుకునేందుకు అంబటి రాంబాబు గారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని, ఆయన వ్యాఖ్యలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు తెలిపారు.అంబటి రాంబాబు వ్యాఖ్యలపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుని ఆయనకు తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని గౌరవ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు డిమాండ్ చేశారు.

Latest News
US Congress presses for stricter AI workplace rules Wed, Feb 04, 2026, 11:23 AM
LS adjourned till noon amid constant sloganeering from Oppn MPs Wed, Feb 04, 2026, 11:18 AM
CM Mamata Banerjee reaches SC for Bengal SIR hearing Wed, Feb 04, 2026, 10:52 AM
Dense fog grips Delhi; low visibility procedures in place at IGI Airport Wed, Feb 04, 2026, 10:43 AM
FC Barcelona ease past Albacete to reach Copa del Rey SF Wed, Feb 04, 2026, 10:40 AM