గబ్బిలాలు నేల మీద ఎందుకు నిలబడవో తెలుసా?
 

by Suryaa Desk | Sat, Jan 31, 2026, 02:19 PM

వెన్నెముక కలిగిన ఏకైక ఎగిరే క్షీరదం గబ్బిలం. ఇది పగటిపూట తలక్రిందులుగా వేలాడుతుంది. బలహీనమైన కాళ్ల వల్ల నేల మీద నిలబడలేక, ఎత్తైన ప్రదేశం నుంచి క్రిందకు జారి ఎగరడం దీనికి సులభం. శత్రువుల నుంచి రక్షణకు, చీకటిలో వస్తువులను గుర్తించడానికి అల్ట్రాసోనిక్ శబ్దాలను ఉపయోగిస్తుంది. గబ్బిలాల ముఖాలు నక్కల్లా ఉంటాయి, వాటి గుండె నిమిషానికి 1,000 సార్లు కొట్టుకుంటుంది. గ్వానో ఎరువుగా ఉపయోగపడుతుంది. అయితే, గబ్బిలాలు కరిస్తే రేబిస్ సోకే ప్రమాదం ఉంది.గబ్బిలాలు అన్ని ఇతర పక్షుల కంటే భిన్నంగా ఉంటాయి. అవి పక్షుల మాదిరిగా నేల నుండి నేరుగా ఎగరలేవు. ఎందుకంటే వాటి కాళ్ళు చాలా బలహీనంగా ఉంటాయి. అయినప్పటికీ, వాటికి లాకింగ్ స్నాయువులు ఉంటాయి. వీటి కారణంగానే అవి ఎలాంటి సపోర్ట్ లేకుండా తలక్రిందులుగా వేలాడగలుగుతాయి.గబ్బిలాల రెక్కలు ఇతర పక్షుల రెక్కల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే వీటి రెక్కలకు ఈకలు ఉండవు. అవి గొడుగులా విస్తరించి ఉన్న చర్మంతో నిర్మితమై ఉంటాయి. బొటనవేలు తప్ప మిగతా వేళ్లన్నీ గొడుగులుగా పనిచేస్తాయి. ఇది కేవలం ఒక్క బొటనవేలు సహాయంతోనే ఏ చెట్టు కొమ్మపైనా వేలాడగలదు.

Latest News
Arsenal reach Carabao Cup final after last-gasp Havertz goal Wed, Feb 04, 2026, 12:53 PM
US Senators accuse UBS of blocking Holocaust truth Wed, Feb 04, 2026, 12:48 PM
CM Mamata files fresh plea in SC to stop voter name deletions during SIR in Bengal Wed, Feb 04, 2026, 12:37 PM
TN records over one lakh new cancer cases in 2025; Chennai reports highest count Wed, Feb 04, 2026, 12:28 PM
Trump calls for federal role in US elections Wed, Feb 04, 2026, 12:23 PM