|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 03:47 PM
రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, నిర్ణీత వయసుకు లోబడిన మైనర్లను సోషల్ మీడియాకు దూరంగా ఉంచే విషయమై విధివిధానాలను రూపొందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సచివాలయంలో ఏర్పాటుచేసిన మంత్రుల బృందం సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చిన్నారులపై సోషల్ మీడియా నిషేధంపై సింగపూర్, ఆస్ట్రేలియా, మలేషియా, ఫ్రాన్స్ లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని ఈ విధానాలు రూపొందించాలని తెలిపారు.
Latest News