|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 01:52 PM
నేటి బిజీ జీవనశైలిలో ఆరోగ్యం క్షీణిస్తోంది. వేళకు భోజనం, నిద్ర, వ్యాయామం లేకపోవడం సమస్యలకు దారితీస్తోంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం, ప్రతిరోజూ 15 నిమిషాలు స్కిప్పింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, బరువు తగ్గుతారు, ఎముకలు బలపడతాయి, డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది, ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఈ ఒక్క అలవాటుతో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.
ప్రతిరోజూ 15 నిమిషాలు స్కిప్పింగ్ చేయడం వల్ల కాళ్ళు, తొడలు, చేతులు, భుజాలలోని కండరాలు బలపడతాయి. ఇది ఆస్టియోపోరోసిస్, పగుళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బలహీనమైన కండరాలు ఉన్నవారికి స్కిప్పింగ్ ప్రయోజనకరంగా ఉంటుంది.
స్కిప్పింగ్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతే కాదు, నిద్రలేమితో బాధపడేవారు ప్రతిరోజూ 15 నిమిషాలు స్కిప్ చేయాలి. ఇది శరీరం విశ్రాంతి తీసుకోవడానికి,బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
మీరు కూడా చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి గురైతే ప్రతిరోజూ 15 నిమిషాలు స్కిప్పింగ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వ్యాయామం ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. అంతేకాకుండా ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మనస్సును ప్రశాంతపరుస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. సహనం, ఓర్పును పెంచుతుంది. ఇది రోజంతా శక్తి, వంతంగా ఉండటానికి, అలసటను తగ్గించడానికి సహాయపడుతుంది.
Latest News