|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 12:06 PM
ఆర్థిక పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న డాలర్, రూపాయి వంటి ఫియాట్ కరెన్సీలు భవిష్యత్తులో కాగితపు ముక్కలుగా మిగిలిపోయే ప్రమాదం ఉందని, అప్పుడు బంగారం మాత్రమే మిమ్మల్ని రక్షిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఇష్టమొచ్చినట్లు నోట్లు ముద్రించడం, అప్పుల భారం వల్ల కరెన్సీ విలువ కోల్పోతోందని, ద్రవ్యోల్బణం డబ్బును తినేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్థిక మాంద్యం, బ్యాంకింగ్ సంక్షోభం సమయంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలినా బంగారం విలువ నిలుస్తుందని, ఇది పెట్టుబడిదారులకు 'సేఫ్ హెవెన్' అని తెలిపారు. భవిష్యత్ ఆర్థిక షాక్‌ల నుంచి తప్పించుకోవడానికి బంగారం, వెండి, బిట్‌కాయిన్‌తో కూడిన మూడు అంచెల వ్యూహాన్ని సూచించారు.
Latest News