|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 11:59 AM
మారుతున్న జీవనశైలి, ఫాస్ట్ ఫుడ్స్ వినియోగం వల్ల మలబద్ధకం సమస్య తీవ్రమవుతోంది. మలబద్ధకం అనేది కొంతమందికి అప్పుడప్పుడు వచ్చే వ్యాధి. మరికొందరు తరచుగా మలబద్ధకంతో బాధపడుతుంటారు. వర్షాకాలంలో మలబద్ధకం మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. వర్షాకాలంలో మలబద్ధకానికి అనేక కారణాలు ఉంటాయి. శరీరంలో నీరు లేకపోవడం, ఆహారంలో ఫైబర్ తీసుకోవడం తగ్గడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాలు ఉన్నాయి. అంతేకాకుండా వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల కారణంగా ఆహారపు అలవాట్లు ప్రభావితం కావడం, హార్మోన్ల మార్పులు జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి. ఒత్తిడి కూడా జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. ఈ కారణాల వల్ల మలబద్ధకం సమస్య వస్తుంది.దీనికి చెక్ పెట్టడానికి వైద్య నిపుణులు ఒక సులభమైన ఇంటి చిట్కాను సూచిస్తున్నారు. పెరుగు, ఎండుద్రాక్షలను వేడి పాలలో కలిపి తోడుపెట్టి, మరుసటి రోజు ఉదయం అల్పాహారంతో లేదా మధ్యాహ్న భోజనంతో తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు తెలిపారు. ఈ రెసిపీని పాటించడం ద్వారా అనవసరమైన ఆసుపత్రి ఖర్చులను తగ్గించుకోవచ్చని సూచించారు.
Latest News