|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 11:56 AM
నిర్ణీత వయసుకు లోబడిన మైనర్లను సోషల్ మీడియాకు దూరంగా ఉంచే విషయమై విధివిధానాలను రూపొందించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సోషల్ మీడియా జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడంపై సచివాలయంలో ఏర్పాటుచేసిన మంత్రుల బృందం సమావేశానికి మంత్రి లోకేశ్ అధ్యక్షత వహించారు.ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, చిన్నారులపై సోషల్ మీడియా నిషేధం విధించే అంశంపై సింగపూర్, ఆస్ట్రేలియా, మలేషియా, ఫ్రాన్స్‌లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాల్సిందిగా సూచించారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు గైడ్ లైన్స్‌ను పరిగణనలోకి తీసుకుని మార్గదర్శకాలు రూపొందించాలని అన్నారు.సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పోస్టు చేసే వారితో పాటు కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే హెబిచ్యువల్ అఫెండర్స్‌ను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు చేపట్టాలని అన్నారు. దీనిపై చర్చించేందుకు గూగుల్, మెటా, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ కంప్లయన్స్ ఆఫీసర్లను కూడా వచ్చే జీవోఎం సమావేశానికి రప్పించాలని సూచించారు.
Latest News